బంగాల్లో నిరసనల హోరు
పౌరసత్వ చట్ట సవరణ సహ జామియా ఘటనకు వ్యతిరేకంగా పశ్చిమబంగాల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు నిరసన చేపట్టారు. జాదవ్‌పుర్ విశ్వవిద్యాలయం, కలకత్తా, ప్రెసిడెన్సీ, ఆలియా వర్సిటీల విద్యార్థులు నిరసనలో పాల్గొన్నారు.
21:42 December 21
బంగాల్లో నిరసనల హోరు
పౌరసత్వ చట్ట సవరణ సహ జామియా ఘటనకు వ్యతిరేకంగా పశ్చిమబంగాల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు నిరసన చేపట్టారు. జాదవ్‌పుర్ విశ్వవిద్యాలయం, కలకత్తా, ప్రెసిడెన్సీ, ఆలియా వర్సిటీల విద్యార్థులు నిరసనలో పాల్గొన్నారు.
20:54 December 21
కేరళలో కాగడాల ర్యాలీ
పౌర చట్ట వ్యతిరేక నినాదాలతో కేరళ రాజధాని తిరువనంతపురం హోరెత్తింది. వామపక్ష పార్టీల యువతా విభాగాల ఆధ్వర్యంలో నగరంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు.
20:54 December 21
జైపుర్‌లో భద్రత కట్టుదిట్టం
జైపుర్‌లో పౌర ఆందోళనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెట్రో సేవలను నిలిపేయనున్నట్లు ప్రకటించారు అధికారులు. అదే విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు అంతర్జాల సేవలను బంద్ చేయనున్నట్లు వెల్లడించారు.
20:48 December 21
పౌరచట్టంపై కేరళ గవర్నర్ స్పందన
పౌరచట్టం విషయమై మహాత్మాగాంధీ, పండిట్ నెహ్రూ, నాటి కాంగ్రెస్ అభీష్టం మేరకే కేంద్ర సర్కారు పనిచేసిందన్నారు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్. 1985, 2003 సంవత్సరాల్లో పౌరచట్ట సవరణకు పునాది పడిందన్నారు. పొరుగుదేశాల నుంచి ఉద్యోగాలు చేసేందుకు వచ్చే ముస్లింలను ప్రభుత్వం అనుమతిస్తోందన్నారు. కానీ హింసకు గురయ్యారన్న కారణంతో కాదన్నారు.
19:51 December 21
మృతుల కుటుంబాలకు దిల్లీ వక్ఫ్ బోర్డు పరిహారం
దేశవ్యాప్తంగా పౌర నిరసనల్లో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించింది దిల్లీ వక్ఫ్ బోర్డు. ఈ ఖర్చును వక్ఫ్ బోర్డు భరిస్తుందని ఆప్ ఎమ్మెల్యే, దిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అమనతుల్లా ఖాన్ స్పష్టం చేశారు.
19:40 December 21
ఆజాద్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ బెయిల్ పిటిషన్‌ను దిల్లీ తీస్ హజారి కోర్టు కొట్టివేసింది. 14 రోజుల జుడిషీయల్ కస్టడీకి అనుమతిస్తూ పోలీసులకు ఆదేశాలిచ్చింది. తీస్ హజారి కోర్టు నుంచి ఆజాద్‌ను తిహార్ జైలుకు తరలించారు పోలీసులు.
19:10 December 21
తీస్ హజారి కోర్టులో భీమ్ ఆర్మీ ఆజాద్ బెయిల్ పిటిషన్
భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్.. దిల్లీ తీస్ హజారి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆజాద్‌కు 14 రోజుల జుడిషీయల్ కస్టడీకి అనుమతించాలని పోలీసులు కోర్టును కోరారు.
దిల్లీ జామా మసీదు నుంచి జంతర్ మంతర్ వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించాలని ప్రయత్నించారు ఆజాద్. భద్రత కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నిరసనకారులు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో ఆజాద్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
19:01 December 21
రాజ్‌ఘాట్ వద్ద రేపు కాంగ్రెస్ ధర్నా
18:50 December 21
హరిద్వార్‌లో 144 సెక్షన్ విధింపు
18:06 December 21
లఖ్‌నవూలో టెలికాం సేవల రద్దు కొనసాగింపు
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో టెలికాం సేవల నిలిపివేతను కొనసాగించాలని పోలీసులు నిర్ణయించారు. పౌర నిరసనల కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం వరకు పొడగించారు.
18:00 December 21
శీలంపుర్ నిందితులకు న్యాయనిర్బంధం
దిల్లీలోని శీలంపుర్ అల్లర్లలో అరెస్టయిన నిందితులకు 14 రోజుల జుడిషీయల్ కస్టడీ విధించింది దిల్లీ కోర్టు.
దరియాగంజ్ కేసులో 15మందికి తీస్ హజారి కోర్టు 2 రెండు రోజుల న్యాయనిర్బంధం విధించింది.
17:49 December 21
పౌరచట్టంపై భాజపా అవగాహన కార్యక్రమం
పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని భాజపా నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే 10 రోజుల్లో 3 కోట్ల కుటుంబాలను కలిసి చట్టంలోని అంశాలను వివరించనుంది. 250 ప్రాంతాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి వివరిస్తామని కమలం నేత భూపేందర్ యాదవ్ తెలిపారు.
17:43 December 21
కాన్పూర్‌లో పోలీసులు, నిరసనకారుల ఘర్షణ
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లో పౌర చట్టం వ్యతిరేక నిరసనల్లో పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు పోలీసులు.
17:36 December 21
కాన్పూర్‌లో పోలీసులు, నిరసనకారుల ఘర్షణ
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లో పౌర చట్టం వ్యతిరేక నిరసనల్లో పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు పోలీసులు.
17:02 December 21
యూపీలో 15 మంది మృతి: ఐజీ
ఉత్తర్‌ప్రదేశ్‌లో పౌరచట్టానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయినప్పటి నుంచి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రకటించారు శాంతి భద్రతల శాఖ ఐజీ ప్రవీన్ కుమార్.
16:53 December 21
దిల్లీలో దరియాణ్గంజ్లో జరిగిన ఘర్షణలో అదుపులోకి తీసుకున్న నిందితులను ఈ రోజు తీస్ హజారి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు.
16:50 December 21
గువహటిలో మహిళల ఆందోళన
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అసోం మహిళలు ఉద్యమించారు. గువహటిలోని లతాశిల్ మైదానంలో మహిళలంతా బైఠాయించి నిరసన తెలిపారు.
16:48 December 21
ఉత్తరాఖండ్‌లో నిరసనలు..
16:04 December 21
యూపీలో రాళ్లదాడి...
ఉత్తర్‌ప్రదేశ్ రాంపుర్‌లో పౌరసత్వ చట్టంపై చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు.
15:06 December 21
జల ఫిరంగుల ప్రయోగం..
కేరళ కోజికోజ్లో పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనలు చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అదుపుచేసేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు.
14:40 December 21
చిన్నపిల్లలు కూడా...
బిహార్‌లో ఆర్జేడీ పిలుపునిచ్చిన బంద్‌లో భాగంగా పట్నాలో భారీ ర్యాలీ చేపట్టారు పార్టీ కార్యకర్తలు. చిన్నపిల్లలు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
14:29 December 21
చెన్నైలోనూ ఆందోళనలు...
తమిళనాడు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎదుట.. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. నిరసనకారులు.. బారికేడ్లను తొలగించి విధ్వంస పరిస్థితులకు కారణమయ్యారు.
14:27 December 21
మరోసారి జామియా ముందు నిరసన...
14:02 December 21
బిహార్‌లో ఆటోలపై విరుచుకుపడ్డ ఆర్జేడీ కార్యకర్తలు
'పౌర' చట్టానికి వ్యతిరేకంగా బిహార్‌లో ఆర్జేడీ పార్టీ నేడు 'బంద్' కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ కార్యకర్తలు భగల్‌పుర్ ప్రాంతంలో రోడ్లపై నడిచే ఆటోలపై కర్రలతో దాడి చేశారు. ఈ విధ్వంసంలో పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
14:00 December 21
దిల్లీ దరియాగంజ్ 'పౌర'అల్లర్లపై చర్యలు.. 15 మంది అరెస్ట్
పౌర చట్టానికి వ్యతిరేకంగా దిల్లీ దరియాగంజ్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించి తాజాగా 15 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్న 40 మందిని అదుపులోకి తీసుకోగా..అందులో 8 మంది మైనర్లను విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. అరెస్ట్ చేసిన వారికి న్యాయ సహాయం అందించాలని.. వారిని న్యాయవాదులు కలిసేందుకు అనుమతించాలని ఆదేశించింది దిల్లీ కోర్టు.
13:59 December 21
యూపీ 'పౌర' అల్లర్లలో 11కి చేరిన మృతులు
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 11కి చేరింది. మేరఠ్ జిల్లాలో జరిగిన అల్లర్లలో నలుగురు మృతి చెందారు. వారణాసిలో పోలీసులు, ఆందోళనకారుల ఘర్షణల నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
ప్రార్థనల అనంతరం చెలరేగిన హింస..
గోరఖ్‌పూర్, సంభాల్, భదోహి, బహ్రయిచ్, బులంద్‌శహర్, ఫిరోజాబాద్ సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసనకారులు రెచ్చిపోయారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహనాలకు నిప్పంటించారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. రబ్బరు తూటాలతో కాల్పులు జరిపారు. బిజ్నోర్, మేరఠ్, సంభాల్, ఫిరోజాబాద్, కాన్పూర్‌లో ఆరుగురు మరణించారు. ఆందోళనకారుల దాడిలో 50 మందికిపైగా పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు పోలీసులకు తూటాలు తగిలాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
13:34 December 21
దేశ వ్యాప్తంగా పౌరసత్వ చట్ట ఆగ్రహ జ్వాలలు
పౌరసత్వ చట్టంపై ఆగ్రహ జ్వాలలు ఇవాళా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. నేడు బిహార్ బంద్‌కు పిలుపునిచ్చింది రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) పార్టీ. బంద్‌ను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చారు. దర్భంగాలోని రహదారిపై టైర్లకు నిప్పంటించి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. దర్భంగాలోని రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలను నిలువరించారు. పౌరచట్టానికి వ్యతిరేకంగా ఆర్జేడీ పిలుపునిచ్చిన బంద్‌కు మద్దతు తెలపాలని ప్రజలను కోరారు ఆ పార్టీనేత, బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్.