తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సమస్యల నుంచి తప్పించుకునేందుకే సీఏఏ, ఎన్​ఆర్​సీ'

​​​​​​​పౌరసత్వ సవరణ చట్టం దేశ ప్రజల మత, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందని ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ అభిప్రాయపడ్డారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఎన్​డీఏ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు.

MH-CITIZENSHIP-PAWAR
MH-CITIZENSHIP-PAWAR

By

Published : Dec 21, 2019, 1:26 PM IST

పౌరసత్వ చట్టంపై స్పందించిన ఎన్​సీపీ అధినేత శరద్ ​పవార్​.. ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలోని ప్రధాన సమస్యల నుంచి ఎన్​డీఏ ప్రజల దృష్టి మరల్చుతోందని ఆరోపించారు.

"ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఏఏ, ఎన్​ఆర్​సీలను పావులుగా వాడుకుంటున్నారు. మైనారిటీలే కాదు.. ఐక్యత, అభివృద్ధి కోరుకునే వారూ ఎన్​ఆర్​సీ, సీఏఏను వ్యతిరేకిస్తున్నారు. ఈ కొత్త చట్టం మత, సామాజిక ఐక్యత, సామరస్యాన్ని దెబ్బతీస్తుంది."

-శరద్​ పవార్, ఎన్​సీపీ అధినేత

సీఏఏ ద్వారా పాకిస్థాన్​, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్​కు చెందిన వారికే అవకాశం ఇవ్వటం ఏమిటనీ.. శ్రీలంక తమిళులు ఏం చేశారని పవార్ ప్రశ్నించారు. బిహార్​తో సహా 8 రాష్ట్రాలు ఈ బిల్లును అమలు చేసేందుకు నిరాకరించాయని... మహారాష్ట్రలోనూ అమలు కానివ్వమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'పౌరసత్వం పేరుతో భారతీయులను వేధించం'

ABOUT THE AUTHOR

...view details