కరోనాకు ప్రధాన కేంద్రమైన చైనాలోని వుహాన్ నగరంలో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం మరో సారి సహాయక చర్యలకు సిద్ధమైంది. ఇందుకోసం ఈ నెల 20న సీ-17 మిలిటరీ విమానాన్ని వుహాన్కు పంపించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
భారతీయులను స్వదేశానికి తీసుకురావడం సహా.. చైనాకు సహాయంగా ఈ విమానంలో పలు ఔషధాలు, వైద్య పరికరాలను పంపించనున్నట్లు మిలిటరీ అధికారులు తెలిపారు.
ఇదివరకే ఎయిర్ ఇండియా విమానాలను చైనాకు పంపి మొత్తం 640 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది ప్రభుత్వం. ఆ తర్వాత చైనాకు ఔషధాలు, ఇతర వైద్య పరికరాలను పంపించనున్నట్లు గత వారం ప్రకటించింది.
కరోనాను ఎదుర్కొనేందుకు చైనాకు అండగా తీసుకున్న ఈ నిర్ణయంపై ఆ దేశ రాయబారి సన్ వేయ్డంగ్ భారత్కు అభినందనలు తెలిపారు. హుబే ప్రావిన్సులో ఉన్న భారతీయులెవ్వరికీ కరోనా సోకలేదని.. అక్కడి అధికారులు వారికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:ఆపరేషన్ కరోనా: ఐటీబీపీ శిబిరం నుంచి ఇళ్లకు 302 మంది