నేడు మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో మరో 51 శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. భాజపా, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ 11, గుజరాత్ 6, బిహార్ 5, అసోం 4, హిమాచల్ ప్రదేశ్ 2, తమిళనాడులో 2 సీట్లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు పంజాబ్ 4, కేరళ 5, సిక్కిం 3, రాజస్థాన్ 2 స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.
అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పుదుచ్ఛేరి, మేఘాలయా, తెలంగాణలో ఒక్కో స్థానంలో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో 30 నెలల అధికారాన్ని పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఈ ఉపఎన్నికలు ఓ పరీక్ష అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.