తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ బస్సు హైజాక్​ వార్తలు అవాస్తవం - హైజాక్​కు గురైన బస్సు

bus-hijacking-in-agra
ఆగ్రాలో బస్సు హైజాక్​

By

Published : Aug 19, 2020, 10:04 AM IST

Updated : Aug 19, 2020, 11:48 AM IST

11:15 August 19

ఆ బస్సు హైజాక్​ వార్తలు అవాస్తవం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ ప్రయాణికుల బస్సు హైజాక్‌కు గురైనట్లు వచ్చిన వార్తలు పోలీసులను కాసేపు ఉరుకులు పరుగులు పెట్టించాయి. అయితే బస్సు హైజాక్‌కు గురికాలేదని తెలియటం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. 34 మంది ప్రయాణికులతో గురుగ్రామ్‌ నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు ఓ ప్రైవేట్‌ బస్సు వెళ్తోంది. బస్సును మధ్యలోనే పలువురు ఆపి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. డ్రైవర్‌, కండక్టర్‌ను దించి వారు బస్సును గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్తుండటం వల్ల ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బస్సు హైజాక్‌కు గురైందేమోనని భయపడి పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆగ్రాలోని థానా మల్పూర్‌ ప్రాంతంలో ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బస్సును స్వాధీనం చేసుకున్నది ఫైనాన్స్‌ కంపెనీ ఉద్యోగులని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. బస్సుపై తీసుకున్న లోన్‌ ఈఎంఐలు యజమాని చెల్లించకపోవడంతో వారు బస్సును ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఫైనాన్స్‌ కంపెనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. బస్సును ఝాన్సీ ప్రాంతానికి తరలించారు.

10:40 August 19

ఆగ్రాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు హైజాక్​కు గురైంది. కారును అడ్డుపెట్టి బస్సును ఆపిన దుండగులు.. తర్వాత ఆ బస్సును కుబేర్‌పుర్‌కు వైపు మళ్లించినట్లు సమాచారం. బస్సు హైజక్​కు గురై పది గంటలు కాగా.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

10:01 August 19

ఆగ్రాలో బస్సు హైజాక్​

ఆగ్రాలో  బస్సు హైజాక్​కు గురైంది. బస్సులో 34మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే హైజాక్​ చేసింది ఎవరు అన్న విషయం తెలియాల్సి ఉంది.

Last Updated : Aug 19, 2020, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details