బస్తు బోల్తా- ముగ్గురు మృతి, ఐదుగురికి గాయాలు - ఉత్తర్‌ప్రదేశ్ అలీఘర్ జిల్లాలో బస్సు ప్రమాదం
09:01 October 10
బస్తు బోల్తా- ముగ్గురు మృతి, ఐదుగురికి గాయాలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లా తప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. 45 మంది ప్రయాణికులతో ఉన్న బస్సు దిల్లీ నుంచి కాన్పుర్ వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
సీఎం స్పందన...
దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులకు సూచించారు.