తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రక్షణ కోసం బంకర్లను సిద్ధం చేస్తోన్న కశ్మీరీలు - షెల్లింగ్

జమ్ముకశ్మీర్​లో యుద్ధం వస్తోందన్న వదంతులతో సరిహద్దు ప్రజలు భయాందోళనలో ఉన్నారు. యుద్ధం మొదలైతే తమను తాము కాపాడుకునేందుకు బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు అక్కడి ప్రజలు.

రక్షణ కోసం బంకర్లను సిద్ధం చేస్తోన్న కశ్మీరీలు

By

Published : Aug 3, 2019, 10:15 PM IST

కశ్మీర్​ పరిణామాల నేపథ్యంలో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పాక్​తో యుద్ధం మొదలవబోతోందన్న ఊహాగానాల నడుమ సరిహద్దు ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. తూటాలు, షెల్లింగ్​ల నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి బంకర్లను సిద్ధం చేస్తున్నారు. ఉత్తర కశ్మీర్​లోని ఓ బంకర్​ను ఈటీవీ భారత్​ బృందం సందర్శించింది.

తమను తాము కాపాడుకునేందుకు సరిహద్దు ప్రజలు నిర్మించుకున్న బంకర్ల విశేషాలు మీకోసం...

ఉత్తర కశ్మీర్​లోని ఓ బంకర్
  • భూమిలో 10 అడుగుల లోతులో వీటిని నిర్మిస్తారు.
  • లోపలికి వెళ్లేందుకు మెట్లు, బయటికి చూసేందుకు కిటికీ ఉంటుంది
  • ఈ బంకర్​లో 5 నుంచి 7 సభ్యులు ఉండేందుకు వీలుంటుంది
  • మోర్టార్​ షెల్లింగ్​, తూటాలను తట్టుకుని నిలబడుతుంది

ఇదీ చూడండి: ఆపరేషన్​ కశ్మీర్​: భయం, నిరాశతో స్వస్థలాలకు..

ABOUT THE AUTHOR

...view details