తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శిరిడీలో కొనసాగుతున్న బంద్... తెరిచే ఉన్న ఆలయం

మహారాష్ట్ర శిరిడీ పట్టణంలో బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయిబాబా ఆలయం తెరిచే ఉన్నందున భక్తులు దర్శనం కొనసాగిస్తున్నారు. పాథ్రీని బాబా జన్మస్థలంగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ బంద్​కు పిలుపునిచ్చారు శిరిడీ వాసులు. వివాదాన్ని పరిష్కరించే దిశగా చర్చలు జరపనున్నట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే స్పష్టం చేశారు.

bund in shirdi town
షిరిడీలో కొనసాగుతున్న బంద్... తెరిచే ఉన్న ఆలయం

By

Published : Jan 19, 2020, 9:24 AM IST

Updated : Jan 19, 2020, 9:32 AM IST

పాథ్రీని సాయి జన్మభూమిగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ శిరిడీ వాసులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్​కు స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ విఖే పాటిల్​ మద్దతిచ్చారు. అయితే సాయిబాబా ఆలయం తెరిచే ఉంది. దర్శనం కోసం భక్తలు తరలివస్తూనే ఉన్నారు.

ఇదీ వివాదం...

మహారాష్ట్ర పర్భాణీ జిల్లా పాథ్రీలోని సాయి జన్మస్థానంలో వసతుల కల్పనకు రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే ఇటీవల ప్రకటించగా వివాదం చెలరేగింది. ఈ నిర్ణయంపై శిరిడీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాథ్రీ సాయి జన్మస్థలమని చెప్పేందుకు ఆధారాల్లేవని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సాయి జన్మభూమి వివాదం సద్దుమణిగే దిశగా ప్రయత్నాలు చేయనున్నట్లు తెలిపారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే. సంబంధిత పార్టీలతో రాష్ట్ర సచివాలయంలో సీఎం త్వరలోనే సమావేశం కానున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది ముఖ్యమంత్రి కార్యాలయం.

శిరిడీలో కొనసాగుతున్న బంద్... తెరిచే ఉన్న ఆలయం
Last Updated : Jan 19, 2020, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details