తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బుల్లెట్‌' ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేం! - Railway board chairman

జపాన్​ సహకారంతో రూపొందుతున్న బుల్లెట్​ రైలు ప్రాజెక్టు నిర్ధేశించిన సమయానికి పుర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మహారాష్ట్ర, గుజరాత్​లో నడిచే ఈ రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా భూసేకరణ పూర్తవ్వలేదు. పూర్తిస్థాయిలో భూమి అందుబాటులోకి వచ్చాకే ఇటువంటి ప్రాజెక్టులను ఎప్పటిలోగా పూర్తి చేయగలమనేది ఒక అంచనాకు రాగలమని రైల్వే బోర్డు ఛైర్మన్​ వీకే యాదవ్​ వెల్లడించారు.

Bullet train project progressing well, real timeframe for completion in 3-6 months: Railways
'బుల్లెట్‌’ ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేం!

By

Published : Sep 5, 2020, 9:43 PM IST

Updated : Sep 5, 2020, 9:49 PM IST

ముంబయి- అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో పురోగతి ఉందని రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ అన్నారు. అయితే ఎప్పటికి పూర్తవుతుందనేది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. జపాన్‌ సహకారంతో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను 2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఆ లోగా పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో దీనిపై రైల్వే బోర్డు ఛైర్మన్‌ మాట్లాడారు.

మహారాష్ట్ర, గుజరాత్‌ పరిధిలో నడిచే ఈ రైలు ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పూర్తవ్వాల్సి ఉందని వీకే యాదవ్‌ తెలిపారు. గుజరాత్‌లో 82 శాతం భూసేకరణ పూర్తవ్వగా.. మహారాష్ట్రలో కేవలం 23 శాతం మాత్రమే పూర్తయ్యిందని తెలిపారు. పూర్తిస్థాయిలో భూమి అందుబాటులోకి వచ్చాకే ఇటువంటి ప్రాజెక్టులను ఎప్పటిలోగా పూర్తి చేయగలమనేది ఒక అంచనాకు రాగలమని చెప్పారు. కరోనా వైరస్‌ కారణంగా కొంత ఆలస్యం జరిగిందన్నారు. కొవిడ్‌ పరిస్థితులన్నీ చక్కబడ్డాక బిడ్డింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. ఆ తర్వాత ప్రాజెక్టుకు ఎంత సమయం పడుతుందనేది విషయం చెప్పగలమని 3-6 నెలల్లో చెబుతామని వీకే యాదవ్‌ తెలిపారు.

ఇదీ చూడండి:1.40లక్షల రైల్వే పోస్టులకు డిసెంబర్​లో పరీక్షలు

Last Updated : Sep 5, 2020, 9:49 PM IST

ABOUT THE AUTHOR

...view details