అసోంలో వరదలు తీవ్ర నష్టాలను కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు 14 లక్షలమందిపై ప్రభావం పడింది. వరదల ధాటికి మోరేగావ్ జిల్లా తెంగాగురిలో ఓ పాఠశాల భవనం క్షణాల్లో నేలమట్టమైంది. ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది వరద జనావాసాల్లోకి చేరడమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది.
వరదల ధాటికి క్షణాల్లో భవనం నేలమట్టం! - వరద
అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మోరేగావ్ జిల్లా తెంగాగురిలో వరదల ధాటికి ఓ భవనం క్షణాల్లో కుప్పకూలింది.
వరదల ధాటికి క్షణాల్లో భవనం నేలమట్టం!
25 జిల్లాల్లో వరద ప్రభావం ఉంది. గువహటి, జోర్హాట్, సోనిత్పుర్, గోల్పారా, దుబ్రి వద్ద బ్రహ్మపుత్ర నది ఉధ్ధృతి ఎక్కువగా ఉంది. కచార్, కరీంగంజ్ వద్ద బరాక్ నది తీవ్రరూపు దాల్చింది.
ఇదీ చూడండి: ఆ మామిడి పళ్ల ధర కిలో రూ.2.5 లక్షలు!