పంజాబ్ మొహాలిలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఓ ఇంటి నిర్మాణం కోసం జేసీబీతో తవ్వుతుండగా.. పక్కనున్న మూడు అంతస్తుల భవనానికి కదలికలు వచ్చి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు శిథిలాల కింద ఉన్న ఇద్దరిని సిబ్బంది రక్షించారు. మరో నలుగురు నుంచి ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.