తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో అగ్ని ప్రమాదం-పేలుడు ధాటికి కూలిన భవనం - Building collapses after fire at factory, people trapped: Officials

దిల్లీ పీర్​గఢిలోని ఓ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. సహాయక చర్యలు చేపడుతుండగా పేలుడు సంభవించి ఫ్యాక్టరీ భవనం కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న సిబ్బందిని అగ్నిమాపక దళాలు రక్షించాయి. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు.

Building collapses after fire at factory, people trapped: Officials
దిల్లీలో అగ్ని ప్రమాదం-పేలుడు ధాటికి కూలిన భవనం

By

Published : Jan 2, 2020, 11:27 AM IST

Updated : Jan 2, 2020, 12:43 PM IST

దిల్లీలోని ఓ బ్యాటరీ పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సహాయ చర్యలు చేపడుతుండగా పేలుడు సంభవించి భవనం కుప్పకూలింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహా అందులోని కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని బయటకు తెచ్చేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఈ ఘటనలో 13 మంది అగ్నిమాపక సిబ్బంది సహా మొత్తం 14 మంది గాయపడ్డారు. ఫ్యాక్టరీ సెక్యురిటీ గార్డ్​ సైతం గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. మరొక వ్యక్తి శిథిలాల కింద ఉన్నట్లు వెల్లడించారు.

దిల్లీలో అగ్ని ప్రమాదం దృశ్యాలు

తెల్లవారుజామున ప్రమాదం

ఈ తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో పీర్‌గఢి ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలో మంటలుచెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే 7 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో పేలుడు సంభవించి ఫ్యాక్టరీ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది కూడా శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 35 అగ్నిమాపక యంత్రాలు సహాయ చర్యలు చేపడుతున్నాయి.

కేజ్రీవాల్ స్పందన

ఈ ఘటనపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. మంటలు అదుపుచేయడానికి అగ్ని మాపక దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

Last Updated : Jan 2, 2020, 12:43 PM IST

ABOUT THE AUTHOR

...view details