సాగుచట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల ధర్నా శిబిరాల చుట్టూ గోడ నిర్మించడంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రైతు దీక్షా శిబిరాల చుట్టూ గోడలు కాదు... వంతెనలు నిర్మించాలని ఎద్దేవా చేశారు. కర్షకుల ఆందోళనలు మళ్లీ ఉద్ధృతంగా మారటంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల దీక్షా శిబిరాల వద్ద భద్రతను పెంచి, బారీకేడ్లను పటిష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ ట్వీట్ చేశారు. ఆ ఫొటోలను ట్యాగ్ చేశారు.
గోడలు కాదు.. వంతెనలు నిర్మించండి: రాహుల్
సింఘు సరిహద్దులో రైతుల దీక్షా శిబిరాల చుట్టూ ఇనుప ఊచలు, సిమెంటు గోడలు నిర్మించడంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. నిర్మించాల్సింది గోడలు కాదు.. వంతెనలు అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్ చేశారు.
గోడలు కాదు.. వంతెనలు నిర్మించండి: రాహుల్
సింఘు ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి రైతులు రాకుండా రెండు వరుసల సిమెంటు బారికేడ్లు ఏర్పాటు చేసి.. వాటి మధ్య కాంక్రిట్‌తో ఇనుప ఊచలు అమర్చారు దిల్లీ పోలీసులు. మరోవైపు రోడ్డుకు అడ్డంగా నాలుగైదు వరుసల్లో బారీకేడ్లను ఏర్పాటు చేశారు.