తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దోపిడీలు మాని గేదెల కిడ్నాప్​తో దొంగల నయా ట్రెండ్​

కరుడుగట్టిన నేరస్థులు, బందిపోట్లు, ప్రమాదకరమైన దొంగలు ఎక్కువగా ఉండే మధ్యప్రదేశ్​లోని చంబల్​ డివిజన్​లో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. దారి దోపిడీలు, భారీ దొంగతనాలు వదిలి పేద ప్రజలపై తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు దొంగలు. గేదెలను దొంగలించి యజమానుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.

Buffalo theft for 'ransom' on rise in Morena district of madhya pradesh
గేదెల్ని అపహరిస్తున్న చంబల్ బందిపోట్లు

By

Published : Jan 4, 2020, 6:00 AM IST

మధ్యప్రదేశ్​లోని మురెనా జిల్లా.. అక్రమ ఇసుక తవ్వకాలకు, ప్రమాదకరమైన బందిపోట్లకు ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో డబ్బుల కోసం బందిపోట్లు మరిన్ని అడ్డదార్లు తొక్కుతున్నారు. ప్రజల వద్ద నుంచి గేదెలను అపహరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.

పశువుల పాకలో ఉన్న గేదెలను గుట్టు చప్పుడు కాకుండా అపహరిస్తారు. దొంగలించే సమయంలో పశువుల కాలి గుర్తులు పడకుండా వాటికి ప్లాస్టిక్ షీట్​లను సైతం ఏర్పాటు చేస్తారు. అనంతరం మధ్యవర్తుల ద్వారా యజమానులను సంప్రదిస్తారు. పశువుని విడిచిపెట్టాలంటే వాటి విలువలో 25 నుంచి 30 శాతం కట్టాలని డిమాండ్ చేస్తారు.

గేదెలు దొంగతనానికి గురైనప్పటికీ... బందిపోట్లకు భయపడి కొందరు ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వడం లేదని స్థానికులు చెబుతున్నారు.

గతేడాది 23 కేసులు....

మురెనా జిల్లాలోని పలు గ్రామాల నుంచి చాలా వరకు ఫిర్యాదులు వచ్చినట్లు చంబల్ డివిజన్ పోలీసులు తెలిపారు. జిల్లాలో గత సంవత్సరం ఇలాంటి కేసులు 23 నమోదైనట్లు చెప్పారు.

"గేదెల దొంగతనాల కేసులను నమోదు చేసుకొని సత్వరమే వాటి దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించాను. మధ్యవర్తులు డబ్బులు డిమాండ్ చేసే అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పాను. ఇలాంటి ఏ కేసును వదిలేది లేదు."
-జిల్లా ఎస్పీ

చంబల్ డివిజన్​ అంతా ఇంతే...

ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగమే సంబంధిత నేరాలన్నింటికీ ప్రధాన కారణమని స్థానిక సామాజిక కార్యకర్త రణ్​ సింగ్ పర్మర్​ అభిప్రాయపడ్డారు. మురెనాలోనే కాక చంబల్ డివిజన్​లోని మరో రెండు జిల్లాలైన భిండ్​, శ్యోపుర్​లో ఇలాంటి ఘటనలు జరిగినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details