పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరగనుంది. ఈ నెల 30న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం పంపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
ఒకరోజు తర్వాత..
పార్లమెంటు సమావేశాలకు ముందు అఖిల పక్ష భేటీ జరగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఎప్పుడూ సమావేశాలకు ముందు జరిగే ఈ భేటీ.. ఈసారి ప్రారంభమైన ఒకరోజు తర్వాత జరగనుండటం గమనార్హం. ఈ నెల 29న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలుప్రారంభం కానున్నాయి.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు రాజ్యసభ సమావేశాలు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కొవిడ్ నిబంధనల మధ్య సమావేశాల నిర్వహణపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో లోక్‌సభ స్పీకర్ మంగళవారం సమావేశం నిర్వహించారు.
ఇదీ చూడండి:పార్లమెంటు క్యాంటీన్లో సబ్సిడీ ఎత్తివేత