తెలంగాణ

telangana

'అయోధ్య ఓ బౌద్ధ క్షేత్రం.. ఆలయ నిర్మాణం ఆపండి'

By

Published : Jul 15, 2020, 8:45 AM IST

యావత్​ భారతావని దశాబ్దాల కల అయోధ్యలో రామ మందిర నిర్మాణం. అయితే ఇంకా మందిర నిర్మాణం ప్రారంభం కాకముందే అడ్డంకులు ఎదురవుతున్నాయి. రామ జన్మభూమి ప్రాంతం పురాతన బౌద్ధ క్షేత్రమని, అక్కడ యునెస్కో ఆధ్వర్యంలోనే తవ్వకాలు జరగాలని ఆందోళన చేపట్టారు బౌద్ధ సన్యాసులు. ఆలయ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్​ చేశారు.

Buddhist monks protest in Ayodhya
రామ జన్మభూమి ఓ బౌద్ధ క్షేత్రం

అయోధ్య రామ జన్మభూమి ప్రాంతం పురాతన బౌద్ధ క్షేత్రంగా పేర్కొంటూ.. బౌద్ధ సన్యాసులు మంగళవారం అయోధ్య జిల్లా పాలనాధికారి కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఆ ప్రాంతంలో యునెస్కో (యునైటెడ్​ నేషన్స్​ ఎడ్యుకేషనల్​, సైంటిఫిక్​, కల్చరల్​ ఆర్గనైజేషన్​) ఆధ్వర్యంలోనే తవ్వకాలు జరపాలని డిమాండ్​ చేశారు. రామ మందిరం కోసం భూమి చదును చేస్తున్న క్రమంలో బయటపడిన వస్తువులను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు.

ఇటీవల రామాలయ నిర్మాణం కోసం భూమి చదును చేస్తుండగా.. ఓ శివలింగం, ఏడు నల్ల స్తంభాలు, ఆరు ఎర్ర స్తంభాలు, పూల శిఖరం, నాలుగు విగ్రహాలు బయటపడ్డాయి.

బౌద్ధ సంస్కృతికి చెందినవా !

ఆ ప్రాంతంలో బయటపడిన వస్తువులు బౌద్ధ సంస్కృతికి చెందినవిగా బౌద్ధ సన్యాసులు పేర్కొన్నారు.

ఆలయ నిర్మాణం ఆపాలి..

రామ మందిర నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్​ చేశారు బౌద్ధ సన్యాసులు. అయోధ్యను పురాతన కాలంలో బౌద్ధమతానికి కేంద్రంగా ఉన్న సాకేత్​ నగరంగా భావిస్తారని పేర్కొన్నారు.

" రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి సహా ఇతర ప్రభుత్వ సంస్థలకు అయోధ్య పరిపాలన విభాగం ద్వారా మా వినతి పత్రాలను పంపాం. నెల రోజుల్లోపు రామ మందిర నిర్మాణం నిలిపివేసి.. ఆ ప్రాంతాన్ని యునెస్కోకు అప్పగించకపోతే.. మళ్లీ మా ఉద్యమాన్ని ప్రారంభిస్తాం."

- ఆజాద్​ బౌద్ధ ధర్మ సేనా

బౌద్ధ ధర్మ నాయకుల నుంచి వినతి పత్రం తమకు అందినట్లు వెల్లడించారు ఫైజాబాద్​ నగర మెజిస్ట్రేట్​ ఎస్​పీ సింగ్​. దానిని సంబంధిత వ్యక్తులకు అందజేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: బిహార్‌ ఎన్నికల చదరంగం: కొత్త శక్తులు- పాత ఎత్తులు!

ABOUT THE AUTHOR

...view details