కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం గద్దె దిగటానికి కారణమైన 17 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు వ్యవహారం పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు తెలుసంటూ భాజపా కార్యకర్తలతో ముఖ్యమంత్రి యడియూరప్ప మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం కర్ణాటకలో రాజకీయ అలజడి సృష్టిస్తోంది.
17 మంది ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించి సభలో బలపరీక్షకు హాజరుకాకుండా ముంబయిలోని 5 నక్షత్రాల హోటల్లో బస చేయటానికి అన్ని ఏర్పాట్లు కూడా అమిత్ షానే చేశారని.. అన్ని విషయాలు ఆయనకే తెలుసని ఆడియో టేప్‌లో ఉంది.
ఈ ఆడియో విషయపై యడియూరప్పను ప్రశ్నించగా.. హుబ్లీ నియోజకవర్గం గురించే తాను మాట్లాడానని, బాధ్యత గల కార్యకర్తలెవ్వరూ అలా మాట్లాడకూడదని చెప్పానని అన్నారు.
కోర్టును ఆశ్రయిస్తాం..