ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి తండ్రి ప్రభూ దయాల్(95) కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగానే ఆయన చనిపోయినట్లు పార్టీ ట్విట్టర్లో పేర్కొంది. ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేసింది.
బీఎస్పీ చీఫ్ మాయావతికి పితృవియోగం - బీఎస్పీ
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తండ్రి ప్రభూ దయాల్(95) కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా మరణించినట్లు పార్టీ ట్విట్టర్లో పేర్కొంది.
బీఎస్పీ చీఫ్ మాయావతికి పితృవియోగం
దిల్లీలోని కుమారుడి ఇంట్లో ప్రభూ తుది శ్వాస విడిచారు. తండ్రి భౌతిక కాయానికి మాయావతి నివాళి అర్పించారు.
ప్రభూ దయాల్.. తపాలా శాఖలో సెక్షన్ హెడ్‌గా విధులు నిర్వర్తించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఆరుగురు కుమారులు.