తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హైదరాబాద్​ పోలీసుల నుంచి యూపీ ప్రేరణ పొందాలి'

ఉత్తర్​ ప్రదేశ్​ మాజీ సీఎం మాయావతి దిశ కేసులోని నిందితులను ఎన్​కౌంటర్​ చేసిన హైదరాబాద్ పోలీసులను కొనియాడారు. యూపీలో అత్యాచారాలు జరుగుతున్నా భాజపా ప్రభుత్వం మాత్రం నిద్రలో మునిగి ఉందన్నారు. ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు హైదరాబాద్​ పోలీసుల నుంచి ప్రేరణ పొందాలని సూచించారు మాయ.

bsp chief uttarpradesh former chief minister mayawati says Police of UP and Delhi should take inspiration from Hyderabad Police
'హైదరాబాద్​ పోలీసుల నుంచి యూపీ ప్రేరణ పొందాలి'

By

Published : Dec 6, 2019, 10:43 AM IST

Updated : Dec 6, 2019, 3:45 PM IST

'హైదరాబాద్​ పోలీసుల నుంచి యూపీ ప్రేరణ పొందాలి'

ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్​ సమాజ్​ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయవతి 'దిశ' నిందితుల ఎన్​కౌంటర్​పై స్పందించారు. హైదరాబాద్​ పోలీసులు మంచి పని చేశారని, వారి నుంచి యూపీ పోలీసులు ఎంతో నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు.

"హైదరాబాద్​ పోలీసుల చర్య స్వాగతించదగినది. నిర్భయ కేసులో పోలీసులు ధైర్యం చేసి ఉంటే ఆమె తల్లిదండ్రులకు ఎప్పుడో న్యాయం జరిగి ఉండేదనుకుంటా. ఉత్తర్​ప్రదేశ్​లో రోజూ ప్రతి జిల్లాలో ఇలాంటి ఘటనలు జరుగుతాయి. ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా నిద్రపోతోంది. అందుకు నేను చింతిస్తున్నాను. ఇక్కడి(యూపీ) పోలీసులు హైదరాబాద్​ పోలీసుల నుంచి ప్రేరణ పొందాలి. న్యాయం వైపు అడుగులు వేయాలి. కానీ, బాధ పడాల్సిన విషయం ఒకటి ఉంది. దిల్లీ కావచ్చు, యూపీ కావచ్చు... ఆరోపణలు ఎదుర్కొనే వారిని భాజపా ప్రభుత్వం బంధువులుగా చూస్తోంది. ఇది చాలా సిగ్గు పడాల్సిన విషయం. "

Last Updated : Dec 6, 2019, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details