దేశ రక్షణలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పాత్ర అత్యంత కీలకమన్నారు బీఎస్ఎఫ్ చీఫ్ రాకేశ్ అస్థానా. జమ్ముకశ్మీర్, రాజౌరి, పూంఛ్ జిల్లాల్లోని నియంత్రణ రేఖ వెంట ఫార్వర్డ్ డిఫెన్స్ లొకేషన్స్ (ఎఫ్‌డీఎల్)లో మూడు రోజుల పాటు పర్యటించారు అస్థానా. ఆగస్టులో సాంబా ప్రాంతంలో బయటపడిన ఓ అక్రమ, రహస్య సొరంగం ఉన్న ప్రాంతాన్ని సందర్శించారు. ఆపై పలౌరా క్యాంప్ 'సైనిక్ సమ్మేళనం'లో ప్రసంగించారు.
"మన పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే భారత రక్షణ విభాగంలో మనమే ముందు వరుసలో ఉన్నాం. రెండు పొరుగు దేశాలు మనపై కుట్రకు వ్యూహాలు రచిస్తున్నాయి."