సీఏఏ అల్లర్ల కారణంగా ఇటీవల దేశ రాజధాని దిల్లీ అట్టుడికిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 43మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ఆర్థికంగా నష్టపోయారు. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మొహమ్మద్ అనీస్ ఇల్లు కూడా అల్లర్లలో భాగంగా కాలిపోయింది. అయితే త్వరలో వివాహం చేసుకోబోతున్న అనీస్‌కు.. ఇంటిని పునర్నిర్మించి పెళ్లి కానుకగా ఇవ్వాలని నిర్ణయించింది బీఎస్ఎఫ్. అలర్లలో జవాన్ ఇల్లు ఘోరంగా దెబ్బతిందని, అయితే కుటుంబ సభ్యులంతా సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
"నిఘా వర్గానికి చెందిన ఇంజినీరింగ్ విభాగం దిల్లీకి వచ్చి.. అనీస్ ఇంటి పరిస్థితిని పరిశీలించారు. ఈ ఇంటిని మేము పునర్నిర్మిస్తాం. బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ ఈ బాధ్యతను స్వీకరిస్తుంది. మా సంక్షేమ నిధి నుంచి సాయం అందిస్తాం. ప్రస్తుతం అనీస్ ఫీల్డ్‌లో ఉన్నాడు. త్వరలోనే దిల్లీకి బదిలీ చేస్తాం. తద్వారా కుటుంబానికి చేరువగా ఉంటాడు."
పుష్పేంద్ర రాథోడ్, బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి.