తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇండో-పాక్​ సరిహద్దులో ఆయుధాలు స్వాధీనం - సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)

ఇండో-పాక్​ సరిహద్దు ప్రాంతంలోని ఓ పొలంలో మూడు ఏకే -47లు, రెండు ఎం -16 రైఫిళ్లను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) స్వాధీనం చేసుకుంది. వీటిని పాకిస్థాన్ నుంచి పంజాబ్​ ఫిరోజ్‌పూర్ జిల్లా అబోహార్​ ప్రాంతం గుండా దేశానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

BSF recovers cache of arms near Indo-Pak border in Punjab's Ferozepur
సరిహద్దులో భారీగా ఆయుధాల స్వాధీనం

By

Published : Sep 12, 2020, 3:11 PM IST

పంజాబ్‌ ఫిరోజ్‌పూర్ జిల్లా ఇండో-పాక్​ సరిహద్దు ప్రాంతంలోని ఓ పొలంలో మూడు ఏకే -47లు, రెండు ఎం -16 రైఫిళ్లను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) శనివారం స్వాధీనం చేసుకుంది. వీటితో పాటు పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి.

బీఎస్​ఎఫ్​ దళాలు ఉదయం 7 గంటల సమయంలో సరిహద్దు ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తుండగా ఓ పొలంలో అనుమానస్పదంగా బ్యాగ్​ కనిపించింది. దానిని తెరచి చూడగా ఆరు మ్యాగజైన్లతో 3 ఏకే-47 రైఫిల్స్, 91 రౌండ్లు, 4 మ్యాగజైన్లతో రెండు ఎం-16 రైఫిల్స్, నాలుగు మ్యాగజైన్‌లతో కూడిన రెండు పిస్టల్స్, 20 రౌండ్లు తదితర ఆయుధాలు ఉన్నాయి.

వీటిని పంజాబ్‌ ఫిరోజ్‌పూర్ జిల్లాలోని అబోహార్ ద్వారా పాకిస్థాన్ నుంచి దేశానికి వివిధ మార్గాల ద్వారా పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలోని మరికొన్ని చోట్ల బీఎస్ఎఫ్ దళాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details