ఉగ్ర చొరబాటు భగ్నం- ఇద్దరు ముష్కరులు హతం - ఉగ్ర బలగాలు
08:22 December 17
ఉగ్ర చొరబాటు భగ్నం- ఇద్దరు ముష్కరులు హతం
పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ముష్కరుల కుట్రను భగ్నం చేసింది సైన్యం. అట్టారీ వద్ద దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్ర చొరబాటుదారులను సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) మట్టుబెట్టింది. భద్రతా సిబ్బంది వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఎదురుకాల్పులు..
అనంత్‌నాగ్‌లోని గుండ్ బాబా ఖలీల్ ప్రాంతం వద్ద భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఓ ఉగ్రవాది సైన్యానికి చిక్కాడు.