గుజరాత్లోని రానా ఆఫ్ కచ్ ప్రాంతంలో సుమారు 50 ఏళ్ల వయసు గల పాకిస్థానీ పౌరుడ్ని అదుపులోకి తీసుకున్నాయి బీఎస్ఎఫ్ బలగాలు. తనిఖీలు చేస్తున్న బలగాల దృష్టికి సరిహద్దు పిల్లర్ 1050 సమీపంలో కనిపించాడు సదరు వ్యక్తి.
పట్టుబడ్డ పాక్ పౌరుడు! - పాక్ పౌరుడు
గుజరాత్లోని 'రానా ఆఫ్ కచ్' ప్రాంతంలో బీఎస్ఎఫ్ బలగాల చేతికి ఓ పాకిస్థాన్ పౌరుడు చిక్కాడు. అనుమాస్పదంగా సంచరిస్తున్న అతన్ని కనిపెట్టిన జవాన్లు అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడ్డ పాక్ పౌరుడు
అతడి వద్ద ఏ విధమైన అనుమానిత వస్తువులు లభ్యం కాలేదని, గుర్తింపు తెలిపే ఏ పత్రాలు లేవని అధికారులు వెల్లడించారు. బలగాలు అతడిని లక్ష్యంగా చేసుకోగానే లొంగిపోతున్నట్లు చేతులెత్తాడని పేర్కొన్నారు. రానా ఆఫ్ కచ్ ప్రాంతం భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో కొంతమేరకు కలిసి ఉంటుంది.