- 2007 నవంబరులో తొలిసారి సీఎంగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప
- జేడీఎస్ మాట మార్చడం వల్ల 4 రోజులకే సీఎం పదవి నుంచి వైదొలిగిన యడ్యూరప్ప
- 2008 మే 30న రెండోసారి సీఎంగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప
- మూడేళ్ల 2 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన యడ్యూరప్ప
- అవినీతి ఆరోపణలు రావడం వల్ల 2011లో రాజీనామా చేసిన యడ్యూరప్ప
- 2012లో భాజపాకు రాజీనామా చేసిన యడ్యూరప్ప
- కర్ణాటక జనతా పక్ష పేరుతో కొత్త పార్టీ స్థాపించిన యడ్యూరప్ప
- 2014లో తన పార్టీని భాజపాలో విలీనం చేసిన యడ్యూరప్ప
- 2014 లోక్‌సభ ఎన్నికల్లో షిమోగా నుంచి గెలుపొందిన యడ్యూరప్ప
- 2018 మే 17న మూడోసారి సీఎంగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప
- 1943 ఫిబ్రవరి 27న మండ్య జిల్లా కృష్ణరాజపేట బూకనకెరెలో జన్మించిన యడ్యూరప్ప
- రాష్ట్రీయ స్వయంసేవక్‌సంఘ్‌కార్యకర్తగా పనిచేసిన యడ్యూరప్ప
- 1970 శికారిపుర సంఘ్‌పరివార్‌కార్యదర్శిగా నియమితులైన యడ్యూరప్ప
- 1975లో శికారిపుర పురపాలక అధ్యక్షుడిగా ఎన్నికైన యడ్యూరప్ప
- అత్యవసర పరిస్థితి కాలంలో జైలుకు వెళ్లిన యడ్యూరప్ప
- 1980లో శికారిపుర తాలూకా భాజపా అధ్యక్షుడిగా యడ్యూరప్ప
- అనంతరం షిమోగా జిల్లా భాజపా అధ్యక్షుడిగా పనిచేసిన యడ్యూరప్ప
- 2008లో దక్షిణాది నుంచి భాజపా మొదటి సీఎంగా పనిచేసిన యడ్యూరప్ప
లైవ్: ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణం
18:35 July 26
యడ్యూరప్ప ప్రస్థానం...
18:24 July 26
యడ్యూరప్ప ప్రమాణం...
కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణం చేయించారు.
18:09 July 26
రాజ్‌భవన్‌కు చేరకున్న యడ్డీ...
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న యడ్యూరప్ప రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన సీఎంగా ప్రమాణం చేయనున్నారు.
18:00 July 26
రాజ్‌భవన్‌కు పయనం...
ప్రమాణస్వీకార మహోత్సవం కోసం యడ్యూరప్ప రాజ్‌భవన్‌కు పయనమయ్యారు. కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
17:50 July 26
నాలుగోసారి సీఎంగా...
మూడు వారాల పాటు సంక్షోభంలో కొట్టుమిట్టాడిన కర్ణాటకీయం ఓ కొలిక్కివచ్చింది. మరి కాసేపట్లో భాజపా సీనియర్ నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యడ్డీ నేడు రాష్ట్ర గవర్నర్ వాజూభాయ్ వాలాతో సమావేశమయ్యారు. రాజ్ భవన్‌కు చేరుకోవడానికి ముందు యడ్యూరప్ప హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు.
17:44 July 26
ప్రమాణానికి ముందు పూజలు...
ప్రమాణస్వీకారానికి ముందు యడ్యూరప్ప బెంగళూరులోని కడు మల్లేశ్వర దేవాలయాన్ని దర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
17:31 July 26
సీఎంగా యడ్డీ...
కాసేపట్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. విశ్వాస పరీక్షలో ఓటమిపాలై కుమారస్వామి సర్కారు కుప్పకూలడం వల్ల భాజపాను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించారు.