బిహార్లో వరద బీభత్సం కొనసాగుతోంది. తాజాగా పూర్వీ చంపారన్ జిల్లాలో వరద ధాటికి ఓ వంతెన కుప్పకూలింది.
లైవ్ వీడియో: వరద ధాటికి కూలిన వంతెన - purvi champaran bridge damage
వందల మంది చూస్తుండగానే బిహార్ లో ఓ వంతెన కుప్పకూలింది. వరద ప్రవాహాన్ని తాళలేక రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన వారధి విరిగిపడింది.
వరద ధాటికి చూస్తుండగానే కుప్పకూలిన వంతెన!
గండక్ నది ఆనకట్ట తెగి.. నీరు సోమవతి నదిలోకి పోటెత్తింది. వరద ఉద్ధృతి పెరిగి పూర్వీ చంపారన్ జిల్లా, కోట్వా ప్రఖండ్లో సోమవతి నదిపై నిర్మించిన వంతెన కుప్పకూలింది. ఈ దృశ్యం మొబైల్ కెమెరాలకు చిక్కింది.
ఇదీ చదవండి: వరదలో పురిటి నొప్పులు- పడవలో కాన్పు