తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై అవగాహనకు వినూత్న రీతిలో వివాహం - S. Ranjith gowda and C.S Ranjitha got marraige with mask.

కరోనా వైరస్​పై అవగాహన కల్పించేందుకు వినూత్నంగా వివాహం జరుపుకుంది కర్ణాటక చిక్​బళ్లాపుర్​ జిల్లాకు చెందిన ఓ నవ జంట. మాస్క్​లు ధరించి ఏడడుగులు వేశారు. ఈ పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ మాస్క్​లు ధరించడం విశేషం.

bride and groom got marriage with wore mask
కరోనాపై మాస్క్​లతో అవగాహన కలిపిస్తున్న యువ జంట

By

Published : Mar 20, 2020, 6:32 PM IST

కరోనా వైరస్‌ విస్తృతమవుతున్నవేళ.... కర్ణాటక చిక్‌బళ్లాపుర్‌ జిల్లాలో ఓ యువజంట వినూత్నంగా పెళ్లి జరుపుకుంది. అప్పెన గౌదన హల్లికి చెందిన రంజిత్‌, రంజిత మాస్క్‌లు ధరించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వేడుకకు హాజరైన స్నేహితులు, బంధువులందరూ.. నూతన వధూవరులతో పాటూ మాస్క్‌లు ధరించారు.

కరోనాపై మాస్క్​లతో అవగాహన కలిపిస్తున్న యువ జంట

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకే మాస్క్‌లు ధరించినట్లు నవ దంపతులు తెలిపారు. కొవిడ్‌-19 దేశంలో విజృంభిస్తున్న వేళ ఎక్కువ మంది సమూహంగా ఏర్పడవద్దని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి:ఉరికి ముందు తిహార్​ జైలు ఎస్పీకి నిర్భయ దోషి గిఫ్ట్!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details