బ్రిక్స్ దేశాల 12వ వార్షిక సదస్సు నవంబరు 17న జరగనుంది. 'ప్రపంచ సుస్థిరత, భద్రతలో బ్రిక్స్ భాగస్వామ్యం-వినూత్న వృద్ధి' అనే ఇతివృత్తంతో ఈసారి భేటీ నిర్వహించనున్నట్లు రష్యా తెలిపింది. కరోనా నేపథ్యంలో సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. శాంతి, భద్రత, ఆర్థికరంగం, సాంస్కృతిక తదితర విభాగాల్లో వ్యూహాత్మక సంబంధాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
బ్రిక్స్ సదస్సులో ఎదురుపడనున్న మోదీ-జిన్‌పింగ్ - మోదీ జిన్‌పింగ్
బ్రిక్స్ వార్షిక శిఖరాగ్ర సమావేశం నవంబరు17న జరగనున్నట్లు రష్యా ప్రకటించింది. సరిహద్దులో తీవ్ర వివాదాలు చోటు చేసుకున్న తరువాత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు మొదటిసారి ఈ సదస్సులో ఎదురుపడనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ భేటీకి రష్యా నేతృత్వం వహిస్తుంది.
![బ్రిక్స్ సదస్సులో ఎదురుపడనున్న మోదీ-జిన్‌పింగ్ BRICS virtual summit on Nov 17: Modi, Xi set to come face-to-face for first time since border standoff in Ladakh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9064556-thumbnail-3x2-im.jpg)
బ్రిక్స్ సదస్సులో ఎదురుపడనున్న మోదీ-జిన్‌పింగ్
భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, జిన్‌పింగ్ తొలిసారి ఈ సమావేశంలో ఎదురుపడనున్నారు. ఈ విషయం ఆసక్తిగా మారింది. బ్రిక్స్ సదస్సుకు గత కొన్నేళ్లుగా మోదీ, జిన్‌పింగ్ తప్పకుండా హాజరవుతున్నారు. గతేడాది బ్రెజిల్లో వీరి మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగింది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు బ్రిక్స్ కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రపంచ జనాభాలో సగం బ్రిక్స్ దేశాల్లోనే ఉన్నారు.