తెలంగాణ

telangana

By

Published : Mar 21, 2020, 12:13 PM IST

Updated : Mar 21, 2020, 3:28 PM IST

ETV Bharat / bharat

బ్రెడ్​ వ్యాపారి సైకిల్​పై మోదీ 'జనతా' స్వరం!

మధ్యప్రదేశ్​ ఉజ్జయిన్​లో ఓ బ్రెడ్​ వ్యాపారీ తన సైకిల్​పై ప్రధాని నరేంద్ర మోదీ గళం వినిపిస్తున్నాడు. కరోనాను అరికట్టేందుకు జనతా కర్ఫ్యూను పాటించమని మోదీ చెప్పిన మాటలను ప్రచారం చేస్తూ..సామాజిక బాధ్యతను చాటుకుంటున్నాడు.

bread-seller-awaring-about-janata-curfew-proposed-by-pm-modi-to-fight-against-corona
బ్రెడ్​ వ్యాపారి సైకిల్​పై మోదీ 'జనతా' స్వరం!

బ్రెడ్​ వ్యాపారి సైకిల్​పై మోదీ 'జనతా' స్వరం!

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా భారత్​లోనూ చొరబడింది. అందుకే, ప్రాణాంతక వైరస్​ను తరిమికొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. అయితే, మోదీ సందేశాన్ని ఇంకా విననివారికి, విని వదిలేసినవారికి.. మరోసారి గుర్తు చేస్తున్నాడు మధ్యప్రదేశ్​ ఉజ్జయిన్​కు చెందిన ప్రకాశ్​ ప్రజాపతి.

ఆదివారం ప్రతి ఒక్కరు కర్ఫ్యూను పాటించి, కొవిడ్​-19 పని పట్టాలని వీధివీధి తిరిగి విజ్ఞప్తి చేస్తున్నాడు.

మెహిద్​పుర్​ ప్రాంతానికి చెందిన ప్రకాశ్..​ బ్రెడ్​ వ్యాపారం చేస్తాడు. సైకిల్​పై ​బ్రెడ్​ ప్యాకెట్లు వేసుకుని ఊరూవాడా తిరుగుతాడు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జనతా కర్ఫ్యూ ఎంతో ఉపయోగపడుతుందని గ్రహించాడు ప్రకాశ్. అందుకే, మోదీ పిలుపును వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయాలనుకున్నాడు.

ఇంకేముంది, సైకిల్​కు ఇలా ఓ మైకు ఏర్పాటు చేసి, మోదీ గళాన్ని ప్రజలకు వినిపిస్తూ ప్రశంసలు పొందుతున్నాడు.

"మోదీ ఇచ్చిన పిలుపును దేశ పౌరులంతా స్వాగతించాలి. నేను బ్రెడ్​ వ్యాపారం చేస్తాను. సమాజంలోని ప్రతి వ్యక్తికి ఓ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నా. మోదీ చెప్పిన జనతా కర్ఫ్యూను ప్రతి ఒక్కరూ పాటించాలి. కరోనా వ్యాప్తిని అంతం చేయండి."

-ప్రకాశ్​ ప్రజాపతి, బ్రెడ్​ వ్యాపారి

Last Updated : Mar 21, 2020, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details