భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ మెసియస్ బోల్సొనారో నేడు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చమురు, గ్యాస్, మైనింగ్, సైబర్ భద్రత వంటి రంగాల్లో ఇరుదేశాల సహకారాన్ని పెంపొందించే దిశగా ఈ భేటీలో 15 కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముంది.
భారత్లో బ్రెజిల్ అధ్యక్షుడు.. నేడు ప్రధాని మోదీతో భేటీ - NATIONAL NEWS
బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ మెసియస్ బోల్సొనారో నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో చమురు, మైనింగ్ సహా పలు రంగాలకు ఊతమందించేలా 15 కీలక ఒప్పందాలపై ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు.
![భారత్లో బ్రెజిల్ అధ్యక్షుడు.. నేడు ప్రధాని మోదీతో భేటీ Brazilian Prez Bolsonaro arrives in India; both sides to ink 15 pacts on Saturday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5831900-580-5831900-1579897904617.jpg)
నాలుగు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారమే భారత్ చేరుకున్నారు బ్రెజిల్ అధ్యక్షుడు. కూతురు లారా బోల్సొనారో, కోడలు లెటీసియా ఫిర్మీతో పాటు ఎనిమిది మంది మంత్రుల బృందంతో భారత్కు విచ్చేసిన జాయిర్ బోల్సొనారో.. జనవరి 26న నిర్వహించే 71వ గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈ మేరకు ప్రధాని మోదీ బ్రెజిల్ పర్యటనలో ఉన్నప్పుడే ఆయనను ఆహ్వానించారు. భారత్లో అడుగు పెట్టిన వెంటనే తన బృందంతో కలిసి దిల్లీలోని అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించారు బోల్సొనారో.
ఇదీ చూడండి: చంద్రయాన్-2: టీఎంసీ-2 చిత్రించిన బిలం 3డీ వ్యూ