తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొండచిలువ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు! - కొండచిలువను కాపాడిన సంకల్ప్​జీ పాయ్​

పదేళ్ల బాలుడు.. తన ధైర్యసాహసాలతో ఏకంగా కొండచిలువ బారినుంచే తప్పించుకున్నాడు. ఆ బాలుడు నడుచుకుంటూ గుడికి వెళ్తుండగా ఓ కొండచిలువ అతడి కాలిని పట్టుకుంది. తొలుత భయపడినా.. ఆ తర్వాత చాకచక్యంగా దాన్ని విడిపించుకున్నాడు.

Brave boy scares off python that bit him in Karnataka
కొండచిలువ నుంచి చాకచక్యంగా తప్పించుకున్న పదేళ్ల బాలుడు

By

Published : Oct 10, 2020, 7:35 PM IST

కర్ణాటక మున్నగూడలో పదేళ్ల బాలుడు కొండచిలువ బారినుంచి క్షేమంగా బయటపడ్డాడు. ఐదో తరగతి చదువుతున్న సంకల్ప్​జీ పాయ్​.. ఆలయానికి వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది.

సాయంత్రం వేళ ఇంటి నుంచి గుడికి బయల్దేరగా మార్గమధ్యంలో ఉన్న మురుగునీటి పైప్​ నుంచి ఓ కొండచిలువ.. పదేళ్ల సంకల్ప్​ కుడి కాలిని పట్టుకుంది. తొలుత అతడు భయపడినా.. వెంటనే తేరుకొని, మరో కాలి సాయంతో చాకచక్యంగా దాని నుంచి తనను తాను విడిపించుకున్నాడు. ఇంతలో అది అతడ్ని కాటేసింది.

కొండచిలువను పట్టుకున్న సంకల్ప్​ జీ పాయ్​

కొండచిలువ కాటుకు గురైనా.. ధైర్యసాహసాలు ప్రదర్శించాడు సంకల్ప్​. పైపులో కొండచిలువ ఉన్న విషయం గ్రహించి.. పొరుగువారికి సమాచారమిచ్చాడు. అనంతరం స్థానికులు అక్కడికి చేరుకొని దాన్ని బంధించి, అటవీశాఖకు అప్పగించారు.

కొండచిలువ

సంకల్ప్​ చూపించిన ధైర్యసాహసాలకు సంబంధించిన ఫొటోలు.. సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

ఇదీ చదవండి:పాఠం విని అత్యాచారం జరిగిందని గ్రహించిన బాలికలు

ABOUT THE AUTHOR

...view details