తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్రహ్మోస్​ పరీక్ష మరోమారు విజయవంతం - సూపర్​సోనిక్​ బ్రహ్మోస్ క్రూయిజ్​​

అత్యంత శక్తిమంతమైన సూపర్​సోనిక్​ బ్రహ్మోస్ క్రూయిజ్​​ క్షిపణిని ఒడిశాలో విజయవంతంగా పరీక్షించింది డీఆర్​డీఓ​. భూతల లక్ష్యాలు చేధించడంలో ఈ క్షిపణి నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పనిచేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

BrahMos missile successfully test-fired from Odisha's Chandipur
బ్రహ్మోస్​ పరీక్ష మరోమారు విజయవంతం

By

Published : Dec 17, 2019, 1:03 PM IST

అత్యంత శక్తిమంతమైన సూపర్​ సోనిక్​ బ్రహ్మోస్​ క్రూయిజ్​ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

భూతల లక్ష్యాలను చేధించగల​ బ్రహ్మోస్​ను.. ఒడిశా చండీపుర్​ సమీపంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్​ రేంజ్​ వద్ద ఉదయం 8 గంటల 30 నిమిషాల సమయంలో ప్రయోగించారు. ఈ క్షిపణి నిర్దేశిత ప్రమాణాలకు తగినట్లు ప్రయాణించినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) వర్గాలు తెలిపాయి.

బ్రహ్మోస్.. మధ్యశ్రేణి క్షిపణి. భూ ఉపరితలం మీదనే కాక, జలాంతర్గాములు, ఓడలు, యుద్ధవిమానాల నుంచి ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు. యుద్ధ సమయాల్లో భారత సైనిక, వైమానిక, నావికా దళాలకు అత్యంత ప్రభావవంతంగా ఉపయోగపడుతుంది.

ఇదీ చదవండి:'పౌర' హింసపై సిట్​ దర్యాప్తు- త్వరలో సుప్రీం నిర్ణయం!

ABOUT THE AUTHOR

...view details