తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడు రోజులుగా బోరు బావిలోనే బాలుడు.. - news on borewell

తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లా నడుకట్టుపత్తి  గ్రామంలో బోరుబావిలో పడిన బాలుడిని రక్షించేందుకు సహాయక చర్యలు మూడో రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. 100 అడుగుల లోతులోకి బాలుడు జారినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బోర్లు వేసే యంత్రం సాయంతో మరో బోరు వేస్తున్నారు.

మూడు రోజులుగా బోరు బావిలోనే బాలుడు..

By

Published : Oct 27, 2019, 9:06 AM IST

బోరు బావిలోనే బాలుడు

తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లాల్లో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన రెండున్నరేళ్ల సుజిత్​ను రక్షించేందుకు సహాయక చర్యలు మూడోరోజూ కొనసాగుతూనే ఉన్నాయి. రంగంలోకి దిగిన ఎన్డీఆర్​ఎఫ్​, ఎస్డీఆర్​ఎఫ్​ సిబ్బంది ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. బోరులోపడిన సమయంలో 25 అడుగుల లోతులో ఉన్న చిన్నారి... అక్కడి నుంచి సుమారు 100 అడుగుల లోతులోకి జారిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీని వల్ల సహాయక చర్యలు చేపట్టటం మరింత కఠినంగా మారిందని తెలిపారు.

సమాంతరంగా మరో బోరు..

బోర్లు వేసే యంత్రం సాయంతో బాలుడిని రక్షించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. బోరుబావికి సమాతరంగా ఒక మీటరు వెడల్పుతో మరో బోరు వేస్తున్నారు. బోరుబావిలో ఉన్న బాలుడికి ప్రాణవాయువును అందిస్తున్నారు. రాత్రి వరకు బాలుడి అరుపులు వినిపించాయని.. ప్రస్తుతం ఎలాంటి శబ్దం రావడంలేదని... అయితే బాలుడు ఊపిరి తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈనెల 25న ఘటన..

మనపరాయ్​ నగరానికి సమీపంలోని నడుకట్టుపత్తికి చెందిన సుజిత్​ (2.5) ఈనెల 25న ఇంటి సమీపంలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం అధికారులకు సమాచారం అందించారు.

ఇదీ చూడండి:దీపావళి కాంతుల్లో ఆసేతు హిమాచలం..

ABOUT THE AUTHOR

...view details