దిల్లీలో దారుణం వెలుగు చూసింది. తన సోదరిని తుపాకీతో కాల్చాడు ఓ బాలుడు. ఈ ఘటన ఉత్తర దిల్లీలోని వెల్కమ్ ప్రాంతంలో జరిగింది.
అసలేమైంది?
తన సోదరి ఓ అబ్బాయితో వాట్సాప్ చాటింగ్, ఫోన్లో మాట్లాడుతుండగా చూశాడు 17 ఏళ్ల బాలుడు. మానుకోవాలని పలుమార్లు సోదరిని హెచ్చరించాడు. అయినా ఆమె ఛాటింగ్ కొనసాగిస్తూనే ఉంది. గురువారం ఉదయం ఆ అమ్మాయి మళ్లీ తన స్నేహితుడితో ఛాటింగ్ చేస్తుండగా చూశాడు బాలుడు. ఈ క్రమంలో ఆమెతో వాగ్వాదానికి దిగాడు. కోపోద్రిక్తుడై సోదరిని కడుపులో నాటు తుపాకీతో కాల్చాడు.