యాచకులను, వలసకూలీలను ఇలా అందర్ని ఏదో ఒకరకంగా ఇబ్బందులకు గురిచేసింది లాక్డౌన్. ఎందరికో ఆకలి బాధలు రుచిచూపించింది. అద్దె కట్టలేదని మరికొందర్ని జాలి లేకుండా యజమానుల చేత గెట్టించింది. ఇలాంటి ఘటనే దిల్లీలో జరిగింది.
దిల్లీ ద్వారకలో అద్దింట్లో ఉంటున్న ఓ దంపతులు తమ 12 ఏళ్ల బాలుడిని వదిలిపెట్టి అత్యవసర పని మీద బిహార్ వెళ్లారు. మాయదారి కరోనా వల్ల కేంద్రం లాక్డౌన్ విధించింది. దీంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. అసలే తల్లిదండ్రులు లేక ఆకలి బాధతో ఉన్న పిల్లాడ్ని.. జాలి లేని ఆ ఇంటి యజమాని బయటకు గెంటేశాడు.