సెల్ఫీ సరదా.. ఓ బాలుడి ప్రాణాన్ని హరించేసింది. రైలు ఇంజిన్ ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా.. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన తమిళనాడులో జరిగింది.
అసలేం జరిగింది?
సెల్ఫీ సరదా.. ఓ బాలుడి ప్రాణాన్ని హరించేసింది. రైలు ఇంజిన్ ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా.. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన తమిళనాడులో జరిగింది.
అసలేం జరిగింది?
తిరునెల్వెలి జిల్లా తలాయితులోని చర్చినగర్కు చెందిన బాలుుడు జానేశ్వర్. అతడు తన తండ్రితో కలిసి తిరునెల్వెలి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడ సరదాగా ఆడుకున్నాడు. సెల్ఫీ తీసుకోవాలని రైలు ఇంజిన్ ఎక్కాడు. ఈ క్రమంలో ఇంజిన్పైన ఉన్న 40,000 ఓల్టుల ఓవర్ హెడ్ విద్యుత్ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
ఇదీ చూడండి:50 అడుగుల బావిలో పడిన గజరాజు