భారత్ - చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణ ప్రాంతంలో నిర్దిష్టంగా సరిహద్దు అంటూ ఏమీ ఉండదని 2015 వరకూ లద్దాఖ్‌లో పనిచేసిన కర్నల్ చంద్రశేఖర్ తెలిపారు. కేవలం గుర్తు కోసం బండరాళ్లు పెట్టుకొని దాన్నే సరిహద్దుగా భావిస్తుంటారని, ఇరువైపులా ప్రత్యేకంగా విధులు నిర్వహించే పరిస్థితి కూడా ఉండదన్నారు.
బండరాళ్లే భారత్-చైనా సరిహద్దు: కర్నల్ చంద్రశేఖర్ - భారత్-చైనా సరిహద్దు వివాదం
భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన చోట నిర్దిష్టంగా సరిహద్దు అంటూ ఏమీ లేదని లద్దాఖ్‌లో పని చేసిన కర్నల్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఆ ప్రాంతంలో గుర్తు కోసం బండరాళ్లు మాత్రమే ఉంటాయని వాటినే సరిహద్దుగా పరిగణిస్తున్నట్లు తెలిపారు.
బండరాళ్లే సరిహద్దు: కర్నల్ చంద్రశేఖర్
రెండు దేశాల సైనికులు గస్తీ నిర్వహిస్తుంటారని, భౌగోళికంగా ఎత్తైన పర్వతాల మధ్య ఉండే ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొనడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
ఇదీ చూడండి:డ్రాగన్ దొంగ దెబ్బతో 'మంచుకొండల్లో నెత్తుటేర్లు'