తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కృత్రిమ డైట్​' మాయతో బాడీ బిల్డర్​ కిడ్నీలు ఫెయిల్​ - తెలుగు తాజా వార్తలు

అతనో అంతర్జాతీయ బాడీ బిల్డర్​. కండలను పెంచేందుకు రోజూ కసరత్తులు చేసేవాడు. వాటితో పాటు ప్రత్యేకమైన కృత్రిమ డైట్​ను ప్రారంభించాడు. కానీ అది బెడిసికొట్టింది. ఫలితంగా అతని రెండు కిడ్నీలను పోగొట్టుకున్నాడు. ఇంతకీ ఏం జరిగింది?

Both kidneys of a body builder from kurla failed due to taking exess artificial diet
'కృత్రిమ డైట్​' మాయతో బాడీ బిల్డర్​ కిడ్నీలు ఫెయిల్​

By

Published : Jan 15, 2020, 4:05 PM IST

Updated : Jan 15, 2020, 8:43 PM IST

'కృత్రిమ డైట్​' మాయతో బాడీ బిల్డర్​ కిడ్నీలు ఫెయిల్​

బాడీ బిల్డింగ్​లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఓ యువకుడు 'డైట్'​ అంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కృత్రిమ డైట్​ను ఆనుసరిస్తూ రెండు కిడ్నీలను పాడు చెసుకున్నాడు. ఇది మహారాష్ట్రలోని బుల్​ బజార్​కు చెందిన శ్రిదీప్​ గౌడ్ కథ.

అంతర్జాతీయ బాడీ బిల్డింగ్​ పోటీల్లో ఎన్నో పతకాలు సాధించిన శ్రిదీప్​.. జిమ్​లో చాలా కసరత్తులు చేసేవాడు. కండలు తిరిగిన దేహంతో కనిపించాలని కృత్రిమ డైట్​ను అనుసరించడం మొదలుపెట్టాడు. అయితే కొన్ని కారణాల వల్ల డైట్​ను అపేశాడు. ఎక్కువ రోజులు ఉండలేక తిరిగి అదే డైట్​ను ప్రారంభించాడు.

అప్పుడే అతనికి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఓ రోజు శరీరంలో రక్తపోటు పడిపోయి వాంతులు చేసుకున్నాడు. శ్రీదీప్​ను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు​. అతనికి రెండు కిడ్నీలు పాడైపోయాయని వైద్యులు తెలిపారు.

అవి ఎప్పటికీ ప్రమాదమే

కండలు తిరిగే దేహం కోసం చాలామంది అధిక సమయం వ్యాయామాలు చేస్తుంటారని, కృత్రిమ డైట్​ వల్ల వచ్చే పర్యవసానాల గురించి ఆలోచించరని డాక్టర్లు చెబుతున్నారు. మార్కెట్​లో దొరికే కృత్రిమ ప్రొటీన్లు, పిల్స్​ను ఉపయోగించడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తి చివరకు అవయవం పనిచేయడం ఆగిపోతుందని హెచ్చరిస్తున్నారు.

Last Updated : Jan 15, 2020, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details