తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమ్మాయి కరోనా, అబ్బాయి కొవిడ్​- ఆ కవలల పేర్లు ఇవే... - కవలలకు కరోనా పేర్లు

ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలు బలిగొంటున్న మహమ్మారి కరోనా అంటే ప్రతి ఒక్కరూ గజగజ వణికిపోతున్నారు. కానీ.. ఛత్తీస్​గఢ్​లో ఓ జంట మాత్రం తమకు పుట్టిన కవలలకు ఈ పేర్లే పెట్టాలని నిర్ణయించుకుంది. అవును.. బాబుకు కొవిడ్​ అని, పాపకు కరోనా అని నామకరణం చేసింది.

Born during lockdown, Raipur twins named 'Corona' and 'Covid'
ఆ కవలల పేర్లు కరోనా, కొవిడ్​

By

Published : Apr 3, 2020, 12:08 PM IST

కరోనా వైరస్​ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. తమకు పుట్టిన కవలలకు ఆ పేర్లే పెట్టింది ఛత్తీస్​గఢ్ రాయ్​పుర్​కు చెందిన ఓ జంట. బాబుకు కొవిడ్​, పాపకు కరోనా అని నామకరణం చేసింది.

అడ్డంకుల్ని అధిగమించి...

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన 27 ఏళ్ల ప్రీతి వర్మ.... భర్తతో కలిసి రాయ్​పుర్​లో అద్దెకు ఉంటోంది. మార్చి 26 అర్ధరాత్రి తర్వాత పురిటి నొప్పులు ఆమెను వేధించాయి. లాక్​డౌన్​ పరిస్థితుల మధ్య ఎన్నో ఇబ్బందుల అనంతరం.. డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్​ మెమోరియల్​ ఆస్పత్రికి చేరుకున్నారు ఆ దంపతులు. ప్రీతికి సిజేరియన్​ ఆపరేషన్​ చేశారు. మార్చి 27 తెల్లవారుజామున పండంటి కవలలకు జన్మనిచ్చింది.

''పురిటి నొప్పులు, లాక్‌డౌన్‌, పోలీసులు ఆపడం, తట్టుకోలేని నొప్పి, సిజేరియన్‌ ఆపరేషన్‌, లాక్‌డౌన్‌ వల్ల బంధువులు ఆస్పత్రికి రాలేకపోవడం.. వీటన్నింటి మధ్య ఒక ఆనందం.. మాకు కవలలు పుట్టారు. ఈ కరోనా సమయాన్ని మేం ఎప్పటికీ మర్చిపోలేం. అందుకే మా పిల్లలకు జీవితాంతం గుర్తుండేలా ఈ పేర్లు పెట్టాలనుకుంటున్నాం.''

-ప్రీతి వర్మ, కవలల తల్లి

కరోనా, కొవిడ్​ పేర్లు పెట్టిన అనంతరం ఆ నవజాత శిశువులు ఆస్పత్రిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమ పిల్లలను కరోనా పేర్లతో పిలుస్తుంటే సంతోషపడుతున్నారు ఆ దంపతులు. అయితే... తర్వాత మనసు మారితే పిల్లల పేర్లూ మార్చే అవకాశముందని అంటున్నారు.

ఇటీవల ఉత్తర్​ప్రదేశ్​లోనూ రెండు కుటుంబాలు తమకు పుట్టిన పిల్లలకు కరోనా, లాక్​డౌన్​అని పేర్లు పెట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details