తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చైనా ఏకపక్ష ధోరణి వల్లే ఈ ఉద్రిక్త పరిస్థితులు' - Chinese People's Liberation Army news

తూర్పు లద్దాఖ్​లో భారత్​- చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదు. వివాదాస్పద ఫింగర్స్​ ప్రాంతంలో తిష్ట వేసిన చైనా​ వెనక్కి వెళ్లేందుకు నిరాకరించడమే ఇందుకు కారణం. తాజా ఉద్రిక్తతలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. సరిహద్దులను ఏకపక్షంగా మార్చే ప్రయత్నం చేయడం వల్లే.. ప్రస్తుత ఉద్రిక్తతలు ఏర్పడ్డాయని పేర్కొంది.

Border situation in eastern Ladakh "direct result" of Chinese action to effect unilateral change in status quo
'చైనా ఏకపక్ష ధోరణి వల్లే ఈ ఉద్రిక్త పరిస్థితులు'

By

Published : Sep 3, 2020, 8:50 PM IST

భారత్​- చైనా మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్త పరిస్థితులపై విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. ఉద్రిక్తతలకు కారణం చైనా అనుసరిస్తున్న తీరేనని మండిపడ్డారు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవా. సరిహద్దులను చైనా ఏకపక్షంగా మార్చేందుకు ప్రయత్నించడం వల్లే.. నాలుగు నెలలుగా తూర్పు లద్దాఖ్​లో ప్రతిష్టంభన నెలకొందన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్​ కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇరుదేశాల ముందున్న మార్గం ఇదేనని అభిప్రాయపడ్డారు.

"తూర్పు లద్దాఖ్​లో నాలుగు నెలలుగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులకు కారణం చైనా. ఆ దేశం ఏకపక్షంగా సరిహద్దులు మార్చేందుకు ప్రయత్నించడం వల్లే ఈ ప్రతిష్టంభన ఏర్పడింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు భారత్​తో చర్చలకు రావాలని కోరుతున్నాం"

-- అనురాగ్​ శ్రీవాస్తవా, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి

చైనా పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ(పీఎల్​ఏ) కవ్వింపు చర్యలకు పాల్పడిందని పేర్కొన్నారు శ్రీవాస్తవా. ఇరు దేశాల గ్రౌండ్​ కమాండర్ల సమావేశానికి ఒక రోజు ముందు ఈ చర్యలకు పాల్పడిందని తెలిపారు. చైనా చర్యలను గమనించిన భారత ఆర్మీ... పాంగాంగ్​ సరస్సు దక్షిణ ప్రాంతంలోని మూడు కీలక ప్రాంతాల్లో బలగాలను పెంచిందని స్పష్టం చేశారు.

తూర్పు లద్దాఖ్​లోని పాంగాంగ్​ సరస్సు దక్షిణ తీరంలో ఆగస్ట్​ 29, 30 తేదీల్లో చైనా ఘర్షణకు దిగిందని పేర్కొంది భారత ఆర్మీ. ఎల్​ఏసీ వద్ద యథాతథ స్థితిని మార్చడానికి.. చైనా కవ్వింపుతో కూడిన సైనిక మోహరింపులు చేపట్టినట్లు స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ఏకపక్షంగా మార్చాలన్న చైనా ఉద్దేశాలను అడ్డుకున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు.

అవును.. వెళ్తున్నారు

మాస్కో వేదికగా జరగనున్న షాంఘై కోపరేషన్​ ఆర్గనైజేషన్ ​(ఎస్​సీఓ) విదేశాంగ మంత్రుల భేటీలో ఎస్​ జయ్​శంకర్ పాల్గొననున్నట్లు స్పష్టం చేశారు శ్రీవాస్తవా. సెప్టెంబర్​ 10న ఈ సమావేశం జరగనుంది. ఎస్​సీఓలో భారత్​, చైనా సహా మొత్తం ఎనిమిది దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details