తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గర్భిణిని అడ్డుకున్న పోలీసులు- అంబులెన్స్​లోనే ప్రసవం - నిండు గర్భిణిని అడ్డుకున్న పోలీసులు.. అంబులెన్స్​లోనే ప్రసవం

దేశవ్యాప్త లాక్​డౌన్ కారణంగా అంబులెన్స్​లోనే బిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. గర్భిణీ ఉన్న అంబులెన్స్​ను సరిహద్దు దాటేందుకు కర్ణాటక పోలీసులు అనుమతించకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.

woman delivers baby in ambulance
గర్బిణి

By

Published : Mar 28, 2020, 9:28 PM IST

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్​డౌన్​.. నిండు గర్భిణికీ ఇక్కట్లు తెచ్చిపెట్టింది. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకునేసరికి.. అంబులెన్స్​లోనే బిడ్డకు జన్మనిచ్చింది బిహార్​కు చెందిన గౌరీ దేవి.

అనుమతించని పోలీసులు

25 ఏళ్ల గౌరి, ఆమె భర్త... పొట్టకూటి కోసం బిహార్​ నుంచి కేరళ కాసర్​గోడ్​ జిల్లాకు వలసొచ్చారు. ఓ ప్లైవుడ్​ పరిశ్రమలో ఉపాధి పొందారు. నెలలు నిండిన గౌరికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. అంబులెన్స్​లో తాను ఎప్పుడూ పరీక్షలు చేయించుకునే కర్ణాటక మంగళూరు ఆసుపత్రికి బయల్దేరింది. తాళపాడిలో సరిహద్దు వద్ద అంబులెన్స్​ను అడ్డుకున్నారు కర్ణాటక పోలీసులు.

ఓ వైపు నిండు గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతున్నా.. లాక్​డౌన్​ నిబంధనలను ఉల్లంఘించేది లేదన్నారు పోలీసులు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సహకరించాలన్నారు. గత్యంతరం లేక దగ్గర్లోని మరో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు అంబులెన్స్​ సిబ్బంది. కానీ, అప్పటికే పురిటి నొప్పులు ఎక్కువై వాహనంలోనే పండంటి ఆడబిడ్డను ప్రసవించింది గౌరీ.

ఆ తర్వాత బిడ్డతో సహా ప్రభుత్వాసుపత్రికి చేరింది గౌరి. వైద్యులు పరీక్షించి తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారని తెలిపారు. లాక్​డౌన్​ కారణంగా గర్భిణీలు మాత్రమే కాక... డయాలసిస్​ బాధితులు, హృద్రోగులు, క్యాన్సర్​ చికిత్స పొందుతున్నవారూ అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు స్థానికులు.

ఇదీ చదవండి:లాక్​డౌన్​ రూల్స్​ బ్రేక్​- వేల మందితో దిల్లీ బస్టాండ్ కిటకిట

ABOUT THE AUTHOR

...view details