తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇవి స్వదేశీ బార్బీ బొమ్మలు గురూ! - borby dolls making

బార్బీ బొమ్మలంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అలాగే భారత్​లోని రాంచీ బొమ్మలకూ ఎంతో గుర్తింపు ఉంది. దేశసంస్కృతిని ప్రతిబింబించే వీటిని ఎలా తయారు చేస్తారు, వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

borby dolls have permanent place in kids hearts
పిల్లల మనసుల్లో బార్బీ బొమల స్థానం చెక్కుచెదరలేదు

By

Published : Nov 2, 2020, 2:12 PM IST

స్వదేశీ బార్బీ బొమ్మలు!

బార్బీ డాల్... మనందరికీ సుపరిచితం. హొయలొలికే వాటి తయారీని అమెరికా మేటెల్‌ సంస్థ 1959 మార్చిలో ప్రారంభించింది. 6 దశాబ్దాల తర్వాత కూడా పిల్లల మనస్సుల్లో వాటిస్థానం చెక్కుచెదరలేదు. అయితే.. రాంచీలో తయారయ్యే బొమ్మలు దేశసంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఒక్కొక్కసారి కృష్ణుడికి దూరమైన రాధ, మరొకసారి అశోకవనంలో సీత, కొన్నిసార్లు ఝార్ఖండ్‌ సంప్రదాయ వస్త్రధారణలో నాట్యం చేస్తూ కనిపిస్తుంది. ఇంకొకసారి నెత్తిన కుండతో నీళ్లు తీసుకు వస్తుంటుంది. మనదైన భావన కలిగించి కట్టిపడేసే బొమ్మల ప్రపంచమది. చూస్తే చాలు వాటితో ప్రేమలో పడిపోతారు ఎవరైనా.

"ఈ బొమ్మలంటే మాకెంతో ఇష్టం. పిల్లల్ని ప్రేమించినట్లే వాటినీ ఇష్టపడతాం. నా సంతోషం, వృత్తి అంకితభానికి ఈ బొమ్మలే కారణం."

-శోభాకుమారి, డైరెక్టర్‌, శ్రీజన్‌ హ్యాండీక్రాఫ్ట్స్‌

బొమ్మల తయారీకి ఎంతో ఓర్పు, నేర్పు కావాలి. ఒక్కొక్కదాని తయారీకి గంటల కొద్దీ కష్టపడాల్సి ఉంటుంది. బొమ్మ ఆకృతి కోసం రంపపు పొట్టు వాడతాం. వాటిని చేయటంలో అది మొదటిదశ.

-నీరా ప్రతిభా టొప్నో, బొమ్మల తయారీదారు.

బొమ్మల తలభాగం తయారీకి ప్రత్యేక పదార్థాలు ఉపయోగిస్తారు. తర్వాత సహజ రంగులద్ది, అలంకరిస్తారు. చివరగా, బొమ్మకు చీరచుట్టి బొట్టు, గాజులు పెట్టి సిద్ధం చేస్తారు. ఒక్కోదాని తయారీకి 20గంటల వరకు సమయం పడుతుంది. శోభాకుమారి ఏర్పాటు చేసిన శ్రీజన్‌ అనే సంస్థలో 25మంది మహిళలు బొమ్మలు తయారు చేస్తుంటారు. ఆ ఆదాయంతో వాళ్ల కుటుంబ పరిస్థితీ మెరుగవుతోంది.

"ఇంటి పనులు చక్కబెట్టుకున్నాక, 10, 11గంటల నుంచి పనేం ఉండదు. ఆ సమయం సద్వినియోగం చేసుకోవటానికి మేమంతా బొమ్మలు తయారు చేస్తాం."

-నిషా మెహ్రా, బొమ్మల తయారీదారు

"బొమ్మల తయారీ నేర్చుకోవటం భలేగా ఉంటుంది. అది మా కుటుంబాలకు తోడ్పడేలా కొంత ఆదాయం పొందటానికి మార్గం చూపుతోంది."

-సెలీనా కచ్చప్‌, బొమ్మల తయారీదారు

ఈ అద్భుత కళ వెనుక ఉన్న శ్రమ వెలకట్టలేనిదే అయినా... రాంచీ బొమ్మలు ఒక్కొక్కటి 1500 నుంచి 2000 రూపాయల వరకు పలుకుతుంటాయి. దేశవిదేశాల నుంచి అనేకమంది వాటిని కొనుగోలు చేస్తుంటారు. వాటి అందానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఓకల్‌ ఫర్‌ లోకల్‌ అన్న నినాదానికి కూడా అవి సరిగ్గా సరిపోతాయి. పిల్లలు గనక చూస్తే... ఎక్కడెక్కడి నుంచో దిగుమతి చేసుకునే విదేశీ బొమ్మల కంటే ఇవే కావాలని కోరుకుంటారు. అవి నిజంగా అంత అద్భుతంగా ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details