తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో బాంబుల దాడి- భాజపా కార్యకర్త మృతి - బంగాల్​ నేర వార్తలు

బంగాల్​లో భాజపా ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భాజపా, టీఎంసీ వర్గాల మధ్య పరస్పరం జరిగిన బాంబుదాడుల్లో ఒకరు మృతిచెందగా.. పలు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి.

Bombing at a political campaign of BJP in Barabani in West Bengal
బంగాల్​లో భాజపా ప్రచారంలో కాల్పుల కలకలం

By

Published : Dec 5, 2020, 4:13 PM IST

Updated : Dec 5, 2020, 5:24 PM IST

బంగాల్​ బారాబని ప్రాంతంలో 'అర్​ నోయ్​ అన్యాయ్​' పేరిట భాజపా చేపట్టిన ప్రచార కార్యక్రమంలో బాంబుల దాడి కలకలం రేపింది. భాజపా, తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ) మధ్య జరిగిన ఈ దాడిలో కమలం పార్టీ కార్యకర్త ఒకరు మృతిచెందారు. ఈ ఘటనలో పలు మోటార్​సైకిళ్లు దగ్ధమయ్యాయి. ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలంలో బాంబులను స్వాధీనం చేసుకున్నారు.

భాజపా ప్రచారంలో కాల్పుల కలకలం- ఒకరు మృతి

తమ ప్రచారాన్ని అడ్డుకునేందుకే టీఎంసీ ఈ దాడులకు పాల్పడిందని భాజపా నేతలు బాబుల్​ సుప్రియ, కైలాశ్​ విజయబార్గియా, దిలీప్​ ఘోష్​లు ఆరోపించారు. అయితే.. ఈ ఆరోపణలను ఖండించింది టీఎంసీ. తొలుత ఆ పార్టీ నాయకులే దాడి చేశారని.. ఉద్దేశపూర్వకంగా తమ పార్టీపై నిందలు వేస్తున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి:రైతు సంఘాలతో కేంద్రమంత్రుల చర్చ

Last Updated : Dec 5, 2020, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details