తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో తొలి డ్రోన్ శిక్షణ స్కూల్​ అక్కడే.. - డ్రోన్ శిక్షణ

దేశంలో తొలిసారిగా ఓ డ్రోన్ శిక్షణ స్కూల్​కు అనుమతి ఇచ్చింది డీజీసీఏ. బాంబే ఫ్లయింగ్ క్లబ్ దరఖాస్తును ఆమోదించినట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. అయితే భద్రతకు సంబంధించిన పలు షరతులను పాటించాల్సి ఉంటుందని పేర్కొంది.

Bombay Flying Club becomes country's first DGCA-approved drone training school: Aviation Ministry
దేశంలో తొలి డ్రోన్ శిక్షణ స్కూల్​కు డీజీసీఏ ఆమోదం

By

Published : Jul 28, 2020, 1:14 PM IST

దేశంలో డీజీసీఏ అనుమతి పొందిన తొలి డ్రోన్ శిక్షణ స్కూల్​గా బాంబే ఫ్లయింగ్ క్లబ్ అవతరించింది. క్లబ్ దరఖాస్తుకు డీజీసీఏ(డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఆమోదం తెలిపినట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది.

"డ్రోన్ వినియోగదారులకు శుభవార్త. ప్రొఫెషనల్ డ్రోన్ పైలట్​ కావాలనుకుంటున్నారా? అయితే బాంబే ఫ్లయింగ్​ క్లబ్​లో నమోదు చేసుకోండి. బాంబే ఫ్లయింగ్ క్లబ్ ఇప్పుడు దేశంలో డీజీసీఏ అనుమతి పొందిన తొలి డ్రోన్ శిక్షణ స్కూల్​గా అవతరించింది."

-పౌర విమానయాన శాఖ ట్వీట్

అయితే ఏరియల్ ఫొటోగ్రఫీ, భద్రతకు సంబంధించి కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుందని డీజీసీఏ తెలిపింది. ఇందుకోసం స్థానిక అధికారులు, రక్షణ, హోం మంత్రిత్వ శాఖ, భారత వైమానిక దళం, విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది.

నాన్​ కంప్లైంట్​ డ్రోన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూన్ 8న ప్రారంభించింది పౌర విమానయాన శాఖ. ఇలాంటి డ్రోన్ల వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించేందుకు జనవరి 14-31 మధ్య అవకాశం కల్పించింది. ఈ సమయంలో మొత్తం 19,553 నాన్ కంప్లైంట్ డ్రోన్లు రిజిస్టర్ అయ్యాయి.

జూన్ 5న డ్రోన్ల తయారీ, వాడకంపై కీలక ముసాయిదా నిబంధనలు రూపొందించింది విమానయాన శాఖ. డీజీసీఏ ఆమోదించిన సంస్థ, వ్యక్తికే తయారీదారులు, దిగుమతిదారులు అమ్మాల్సి ఉంటుంది. దీనిపై అభిప్రాయ సేకరణ తర్వాత తుది ముసాయిదా నిబంధనలు విడుదల చేయనుంది.

ఇదీ చదవండి:కాంగ్రెస్​పై మాయ ఫైర్.. ఎమ్మెల్యేల విలీనంపై కోర్టుకు!

ABOUT THE AUTHOR

...view details