తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంజాబ్​లో సన్నీ... బిహార్​లో షాట్​గన్​ - పట్నాసాహిబ్​

బాలీవుడ్​ ప్రముఖులు సన్నీ దేఓల్​, శతృఘ్న సిన్హా లోక్​సభ ఎన్నికలకు నేడు నామినేషన్​లు దాఖలు చేశారు. పంజాబ్​ గురు​దాస్​పుర్​ సీటుకు సన్నీ నామపత్రాలు సమర్పించారు. ఇటీవలే కాంగ్రెస్​లో చేరిన శతృఘ్న సిన్హా... బిహార్​ పట్నాసాహిబ్​ స్థానానికి నామినేషన్​ వేశారు.

పంజాబ్​లో సన్నీ... బిహార్​లో షాట్​గన్​

By

Published : Apr 29, 2019, 4:53 PM IST

Updated : Apr 29, 2019, 5:20 PM IST

నామినేషన్లు వేస్తున్న ప్రముఖ నటులు

బాలీవుడ్​ నటుడు సన్నీ దేఓల్ సోమవారం​ భాజపా టికెట్​పై పంజాబ్​లోని గురుదాస్​పుర్​​ లోక్​సభ స్థానానికి నామినేషన్​ దాఖలు చేశారు. తొలుత అమృత్​సర్​ స్వర్ణదేవాలయం, దుర్గైన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన సన్నీ... సోదరుడు బాబీ దేఓల్​, పంజాబ్​ భాజపా అధ్యక్షుడు, హరియాణా ఆర్థికశాఖ మంత్రి సమక్షంలో నామపత్రం సమర్పించారు.

దివంగత నటుడు వినోద్​ ఖన్నా గురుదాస్​పుర్​​ స్థానానికి 1998, 1999, 2004, 2014లో ప్రాతినిధ్యం వహించారు.

వినోద్​ ఖన్నా మరణానంతరం 2017లో జరిగిన ఉపఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్​ ఎంపీ సునీల్​ జాఖర్​తో సన్నీ దేఓల్​ పోటీపడతారు.

బిహార్​లో శతృఘ్న...

ప్రముఖ బాలీవుడ్​ నటుడు శతృఘ్న సిన్హా బిహార్​లోని పట్నాసాహిబ్ లోక్​సభ నియోజకవర్గానికి నామినేషన్​ దాఖలు చేశారు. 2014లో భాజపా టికెట్​పై ఇదే స్థానంలో బరిలో దిగి గెలుపొందిన సిన్హా... ఇటీవలే కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు.

ఇదీ చూడండి: 'మోదీ, షాపై ఎందుకు చర్యలు తీసుకోరు?'

Last Updated : Apr 29, 2019, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details