రైలులో విద్యార్థులకు పాఠాలు బోధించినట్లు.. ఎప్పుడైనా విన్నారా? వినకపోతే మైసూర్‌లోని అశోకపురం వెళ్లాల్సిందే. విద్యార్థులకు సకల సౌకర్యాలు.... ఆ రైలు బోగీలో సిద్ధంగా ఉన్నాయి. కూలిపోయే స్థితిలో ఉన్న పాఠశాల నుంచి.... విద్యార్థులను రక్షించేందుకు..ఓ ప్రధానోపాధ్యాయుడు చేసిన కృషి ఫలితమే...ఈ రైలు బడి.
మైసూర్ జిల్లా అశోకపురంలో ఓ రైలు బోగీని పాఠశాలగా మార్చారు.. అక్కడి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్. కూలిపోయే స్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు మరమ్మతులు చేయాలని విద్యాశాఖ అధికారులను కోరారు శ్రీనివాస్. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ప్రయోజనం లేకపోవడం వల్ల ఆయన ఈ వినూత్న ప్రయత్నం చేశారు.