తెలంగాణ

telangana

ETV Bharat / bharat

​​​​​​​కండబలమున్న సాహూ.. నీ గుండెబలానికి సాహో! - gold_medal

రోడ్డు పక్కన చిరుతిళ్లమ్మిన కండల వీరుడు ఇప్పుడు ఆసియా బాడీబిల్డింగ్​ ఛాంపియన్​షిప్​లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. వీసా ఖర్చులకు డబ్బులు లేక భార్య నగలు తాకట్టుపెట్టాడు. పేదరికం వెక్కిరిస్తున్నా వెనుదిరగక ముందడుగు వేశాడు.

​​​​​​​కండబలమున్న సాహూ.. నీ గుండెబలానికి సాహో!

By

Published : Aug 7, 2019, 5:45 AM IST

Updated : Aug 7, 2019, 12:26 PM IST

సాహూ.. నీ గుండెబలానికి సాహో!

ఒడిశా భువనేశ్వర్​కు చెందిన రష్మీ రంజన్​ సాహూ... రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్​ ఛాంపియన్​షిప్​ పోటీల్లో ఎన్నో పతకాలు కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు 53వ ఆసియా బాడీ బిల్డింగ్​ ఛాంపియన్​షిప్​లో పాల్గొనే అవకాశం దక్కింది. కానీ, తన కలను సాకారం చేసుకునే మార్గంలో పేదరికం అడ్డుపడుతోంది.

రోడ్డు పక్కన 'బరా'లమ్మిన కండల వీరుడు

రష్మీ రాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తున్నాడు. వచ్చే 8000 రూపాయల జీతంతో కుటుంబాన్ని నెట్టుకురావడమే కష్టం. బాడీ బిల్డింగ్​ చేయాలంటే పౌష్టికాహారం ఎంతో ముఖ్యం. అందుకు డబ్బు కావాలి. బంగాళదుంపలతో తయారు చేసే 'బరా' ఒడిశా చిరుతిండిని రోడ్డుపక్కన అమ్ముకుని అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నాడు.

భార్య బంగారం తాకట్టు

ఎన్నో బంగారు పతకాలు గెలుచుకున్న వీరుడు ఇవాళ భార్య బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

చైనాలో సెప్టెంబర్​లో జరగనున్న బాడీ బిల్డింగ్​ పోటీల్లో భారతదేశాన్ని ప్రతిబింబించే అవకాశం సాహోకు వచ్చింది అందులో పాల్గొనేందుకు, వీసా ఖర్చులకు రెండున్నర లక్షల రూపాయలు కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోరాడు. ఎందరో దాతల దగ్గరికెళ్లి తన గోడు చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయేసరికి తన భార్య బంగారాన్ని తాకట్టు పెట్టి వీసాకి అప్లై చేశాడు.

ఆత్మస్థైర్యానికి నిలువుటద్దం

మిస్టర్​ ఆసియా ఫెడరేషన్​ కప్​, ఈస్టెన్​ ఇండియా బాడీ బిల్డింగ్​ వంటి ఎన్నో ఛాంపియన్​షిప్​లలో పాల్గొని రాష్ట్రానికి పేరు తెచ్చిన సాహూ.. ఇప్పుడు దేశానికే పేరు తెచ్చే విధంగా ఆసియన్​ బాడీ బిల్డింగ్​ ఛాంపియన్​షిప్​-2019లో పాల్గొనే అవకాశం కైవసం చేసుకున్నాడు.

ఎన్ని ఒడుదొడుకులొచ్చినా ధైర్యం కోల్పోని రష్మీ ఎలాగైనా ఛాంపియన్​షిప్​లో పాల్గొనాలని నిశ్చయించుకున్నాడు. తనకంటూ ఓ పేరు సంపాదించుకోవాలన్న తాపత్రయంతో కృషి చేశాడు. అంతర్జాతీయ ఛాంపియన్​షిప్​కు ఎంపికయ్యాడు.

"నేను మిస్టర్​ ఆసియా ఆడడానికి వెళ్తున్నా.. చైనా మొగలియాలో సెప్టెంబర్​ 11 నుంచి, 17 వరకు జరుగుతాయి. అందుకు నేను నేప్పటికే లక్షా ముప్పైవేలు కట్టాను.. మరో లక్ష రూపాయలు కావాలి. డబ్బులు సర్దుబాటైతేనే నేను పోటీలకు వెళ్లగలను.. రాష్ట్ర క్రీడా మంత్రిని కలిశాను 50 శాతం సహకారం అందిస్తామన్నారు. కానీ, ఇంకా 50 శాతం కావాలి. పేదవాడినైనా నేను కాంట్రాక్టు పద్ధతిలో పోలీస్​ ఉద్యోగం సంపాదించాను. రూ.8000/- జీతం వస్తుంది. నాకు ప్రత్నామ్యాయ వ్యాపారం ఉంది. దానితోనే కుటుంబాన్ని, వృత్తిని నెట్టుకొస్తున్నాను."
-రష్మీ రంజన్​ సాహూ, బాడీ బిల్డర్​

ఇదీ చూడండి:సోమవారం గుడి కిటకిట.. బడికి సెలవట!

Last Updated : Aug 7, 2019, 12:26 PM IST

ABOUT THE AUTHOR

...view details