తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బోడో శాంతి ఒప్పందం- అసోంకు సరికొత్త సూర్యోదయం'

అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అసోం కోక్రాఝర్​ బహిరంగ సభలో ప్రసంగించారు మోదీ. బోడో ఒప్పందంతో 50 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని తెలిపారు. మళ్లీ ఈ భూమిపై హింస చెలరేగదని స్పష్టం చేశారు.

modi, assam
ప్రధాని నరేంద్రమోదీ

By

Published : Feb 7, 2020, 3:30 PM IST

Updated : Feb 29, 2020, 12:55 PM IST

జనజీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరించినందుకు బోడో ఉద్యమకారులకు అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. బోడో ప్రాంతానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. శాంతి ఒప్పందంతో అసోంలో మంచి రోజులు రానున్నాయని వ్యాఖ్యానించారు.

అసోంలోని కోక్రాఝర్​ బహిరంగ సభలో పాల్గొన్నారు మోదీ. పౌరసత్వ చట్ట సవరణ తర్వాత మొదటిసారి అసోంలో పర్యటించారు. అసోం రాష్ట్ర ప్రభుత్వం, బోడోలాండ్​ ఉద్యమ సంఘాల మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది.

ఈ మేరకు రాష్ట్రంలో వేడుక చేసుకునేందుకు ఈ సభను నిర్వహించగా... భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. బోడో ఒప్పందంతో అన్ని వర్గాల ప్రజలు గెలిచినట్లేని మోదీ వ్యాఖ్యానించారు.

ప్రధాని నరేంద్రమోదీ

"మీ అందరి సహకారంతో ఈ శాశ్వత శాంతి ఒప్పందం సాధ్యమైంది. ఈ రోజు అసోంతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో నూతన శకం మొదలైంది. ఇది సరికొత్త సూర్యోదయం. అభివృద్ధి, విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలి. ఈ భూమిపై మళ్లీ హింస చెలరేగొద్దు. ఈ భూమిపై ఎవరి రక్తం చిందించాల్సిన పని ఉండదు."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

సీఏఏపై..

సీఏఏపైనా స్పష్టతనిచ్చారు ప్రధాని మోదీ. చట్టం అమలైతే లక్షలాది వలసలు వస్తాయని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అలాంటిదేదీ జరగదని హామీ ఇచ్చారు.

Last Updated : Feb 29, 2020, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details