కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు తెలిపింది ముంబయి మున్సిపల్ కార్పొరేషన్. ఇందుకు సంబంధించి ఓ నిబంధనావళి విడుదల చేసింది.
కరోనా మృతుల అంత్యక్రియలకు ప్రత్యేక రూల్స్ - latest corona dead body news
కరోనా సోకి మరణించిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది ముంబయి మున్సిపల్ కార్పొరేషన్. అయితే మత సంప్రదాయాలు పాటించేది లేదని స్పష్టం చేసింది.
అంత్యక్రియలు
మతంతో సంబంధం లేకుండా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది. మృతుల తరఫున ఐదుగురు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరవ్వడానికి అనుమతినిచ్చింది. కానీ మృతదేహాన్ని తాకకూడదని షరతు విధించింది.
ఇదీ చూడండి : 20 వేల బోగీల్లో 'కరోనా' ఐసోలేషన్ గదులు!