రాజస్థాన్లో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి ఆచూకీ తెలియరాలేదు. వారు కూడా చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. బూందీ జిల్లాలోని కమలేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సుమారు 40 మందితో వెళ్తున్న పడవ అదుపుతప్పి బోల్తాపడింది. 20 నుంచి 25 మంది దాకా.. ఈదుకుంటూ నదీతీరానికి చేరుకున్నారు. మిగతా వారు గల్లంతయ్యారు. ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికితీశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్.. మృతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు.